ఐఐటీ పూర్వ విద్యార్థుల సేవలు అభినందనీయం

30 Jun, 2013 23:56 IST|Sakshi

మెదక్ రూరల్, న్యూస్‌లైన్ : గ్రామీణులకు శుద్ధి నీరు అందించాలన్న ఐఐటీ పూర్వ విద్యార్థుల సేవాభావం అభినందించ దగ్గ విషయమని హైకోర్టు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి అ న్నారు. ఆదివారం పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో మండలంలోని హవేళిఘణపూర్ గ్రామంలో రూ. 4 లక్షలను వెచ్చిం చి ఏర్పాటు చేసిన నీటిశుద్ధి ప్లాంట్ సుభాష్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాంబే ఐఐటీ పూ ర్వ విద్యార్థులు (మండల విద్యార్థి ఒక రు) ముంబాయి (అల్యూమిని) అసోసియేషన్‌గా ఏర్పడి ఫ్లోరైడ్ ప్రాం తాలను గుర్తించి నీటిశుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం గర్వించదగ్గ విషయమన్నారు. గ్రామాల్లో నీటి ట్యాంకులున్నప్పటికీ నేటికి 70 శాతం ప్రజలకు స్వచ్ఛమైన నీరు దొరకక కలుషిత, ఫ్లోరైడ్ నీటిని తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
  అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లో నీటిశుద్ధి ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముం దుకు వచ్చిన అల్యూమిని అసోషియేష న్ చైర్మన్ మధురెడ్డి బృందానికి ఆయన అభినందించారు. అనంతరం కలెక్టర్ దినకర్ బాబు మాట్లాడుతూ ఒక వ్యక్తికి సేవ చేయడం కన్నా పది మందికి ఉపయోగపడే సేవలు చేయటం ఉత్తమమన్నారు. జిల్లా జడ్జి రజిని మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు చేస్తున్న సేవా దృ క్ప థాన్ని చూసి తాను స్ఫూర్తి పొందినట్లు వివరించారు. అల్యుమిని అసోసియేషన్ చైర్మన్ మధురెడ్డి మాట్లాడుతూ ఐఐటీ బాంబే సొసైటీల్లో వంద మంది సభ్యులుగా పనిచేస్తున్నామన్నారు.
 
 వీరిలో 40 మంది గ్రామీణులకు శుద్ధ నీటిని అం దించేందుకు,  మరో 60 మంది సభ్యు లు అనాథ, వృద్ధాశ్రమాలకు సేవలు చే స్తున్నారన్నారు. ఇందులో భాగంగా నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లా ల్లో  ఇప్పటి వరకు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్న పది గ్రామాలను గుర్తించినట్లు తెలి పారు. అందులో మొదటిదిగా మెదక్ జిల్లా హవేళిఘణపూర్‌ను ఎంచుకున్నామన్నారు. ముఖ్యంగా ఐఐటీయన్ సభ్యుల్లో ఒక్కడైన మిత్రుడు గోవర్దన్‌రెడ్డిది హవేళిఘణపూరేనన్నారు. గోవర్దన్ రెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డితో ఫ్లోరైడ్ తాగునీటి విషయమై చర్చించాక నీటిని పరీ క్షించి, ప్లాంట్  ఏర్పాటు చేయడం జరి గిందన్నారు. ఈ సందర్భంగా ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించారు. కార్యక్రమంలో 8వ, అదనపు జిల్లా జడ్జి వెంకట రమణ రాయులు, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్, ఐఐటీయన్ల బృంద సభ్యులు, ఎంపీడీఓ శ్రీనివాస్, తహశీల్దార్ పుష్పలత, సీనియర్ న్యాయవాది ప్రతాప్‌రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు