నిజాంను ఎదిరించిన తొలి మహిళ ఐలమ్మ

10 Sep, 2016 20:00 IST|Sakshi
నిజాంను ఎదిరించిన తొలి మహిళ ఐలమ్మ
మిర్యాలగూడ : నిజాం నిరంకుశ పాలనను ఎదిరించి పోరాడిన తొలి మహిళ చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం మిర్యాలగూడలోని సాగర్‌ రోడ్డులో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద ఆమె వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బాస్కర్‌రావు ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరునగరు నాగలక్ష్మిభార్గవ్, టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, జెడ్పీటీసీ నాగలక్ష్మి, రజక సంఘం నాయకులు నాగభూషణం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాయం ఉపేందర్‌రెడ్డి, నాయకులు ఎడవెల్లి శ్రీనివాస్‌రెడ్డి, మగ్దూమ్‌పాష తదితరులు పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు