గుట్టుగా రంగురాళ్ల తవ్వకం

26 Aug, 2016 21:44 IST|Sakshi
భూమి నుంచి తీసిన రంగురాళ్లు
  • చోద్యం చూస్తున్న అధికారులు
  • నంగునూరు: రంగురాళ్లు తవ్వుతూ కొందరు వ్యాపారులు అక్రమ రవాణా చేస్తూ కాసులు గడిస్తున్నారు. రహదారికి సమీపంలోనే ఈ తతంగం జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలోని ఓ రైతు పొలంలో కొన్ని రోజులుగా రంగు రాళ్ల తవ్వకాలు జరుగుతున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా తవ్వకాలు జరిపి రాళ్లను సేకరించి అనంతరం భూమిని చదును చేస్తున్నారు.

    అనంతరం ఆదే భూమిలో మొక్కలను నాటుతూ ప్రతి రోజు కూళీల చేత రాళ్లను వేరు చేసి అక్రమంగా రవాణా చేస్తున్నారు. భూమిలో నుంచి ఖనిజాలను తీయాలంటే తప్పనిసరిగా మైనింగ్‌ అధికారులు లేదా రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొందరు వ్యాపారులు తవ్వకాలు చేపట్టి రెండు రోజులకోమారు రంగు రాళ్లను దూర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం.

    భూమిలో నుంచి తీసిన పెద్ద రాళ్లను వేరు చేసి కూలీల చేత తమకు కావలసిన సైజులో తయారు చేసి అటోలో తరలిస్తున్నారు. రోడ్డు పక్కనే అక్రమ పారం జరుగుతున్నా అధికారుల పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ రవాణాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు