అక్రమంగా చేపల వేట

28 Apr, 2017 23:45 IST|Sakshi
అక్రమంగా చేపల వేట
నిషేధాజ్ఞల ఉల్లంఘన
అడ్డుకున్న గ్రామస్తులు
మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల వేలం
అల్లవరం (అమలాపుం) :  సముద్రంలో చేపల వేట నిషేధాన్ని ఉల్లంఘించిన మూడు మెకనైజ్డు బోట్లను అల్లవరం గ్రామస్తులు పట్టుకున్నారు. కాకినాడకు చెందిన పొట్టు జగదీష్, యానాం, దరియాలతిప్ప ప్రాం తానికి చెందిన లంకే నాగూరుబాబుకు చెందిన మూడు మెకనైజ్డు బోట్లు నిబంధనలు ఉల్లంఘించి సముద్రంలో చేపల వేట సాగించాయి. వేటాడిన చేపలను ఓడలరేవు తీరం నుంచి తరలించేందుకు సిద్ధం చేస్తుండగా గురువారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని మత్స్యశాఖాధికారులకు సమాచారం అందించారు. ఎఫ్‌డీఓ డేవిడ్‌రాజు ఆధ్వర్యంలో అల్లవరం మండలం ఓడలరేవు మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది మత్స్యసపందను లారీలోకి లోడ్‌ చేస్తున్న సమయంలో దాడి చేశారు. లారీని, మూడు మెకనైజ్డు బోట్లను స్వాధీనం చేసుకున్నారు. లక్షల విలువైన మత్స్య సంపదను వేలం వేసేందుకు  మత్స్యశాఖాధికారులు నిర్ణయించారు. మత్స్యశాఖ ఆధరైజ్డ్‌ అధికారి సీహెచ్‌.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఓడలరేవు జెట్టీ ప్రాంతంలో  మూడు టన్నుల తూర చేపలకు వేలం నిర్వహించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చేపల వ్యాపారులు వేలంలో పాల్గొన్నారు. కిలోకు రూ.25 ప్రభుత్వ ధర నిర్ణయించగా, కాకినాడకు చెందిన సీహెచ్‌.చిన్ని రూ.36 చొప్పున పాటను దక్కించుకున్నారు. కంటైనర్‌లో ఉన్న చేపలను గ్రామస్తుల సమక్షంలో తూకం వేసి పాటదారుడుకి అప్పగిస్తామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఒక్కో బోటుకు రూ.2500 చొప్పున జరిమానా విధించారు. వేలం పాటలో కాకినాడ ఎఫ్‌డీఓ ఆర్‌వీఎస్‌ ప్రసాద్, కె.వెంకటేశ్వరరావు, అల్లవరం ఎఫ్‌డీఓ డేవిడ్‌రాజు, సీహెచ్‌.ఉమామహేశ్వరరావు, సర్పంచి కొల్లు సత్యవతి, కొల్లు త్రిమూర్తులు, కాకినాడ బోటు ఓనర్స్‌ అధ్యక్షుడు ఓలేటి గిరి, అవనిగడ్డ శేషగిరిరా>వు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు