పాండవుల కొండను కొల్లగొట్టేస్తున్నారు!

18 Nov, 2016 00:32 IST|Sakshi
పాండవుల కొండను కొల్లగొట్టేస్తున్నారు!

►  మడ్డువలసలో అక్రమ క్వారీ నిర్వహణ
  అనుమతుల్లేకున్నా..అడ్డుగోలుగాతవ్వకాలు
  రవాణాకు రంగం సిద్ధం చేస్తున్న వైనం
  పొరుగు జిల్లా మంత్రి పేరుతో దందా

 

మడ్డువలస..ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే గొర్లె శ్రీరాములునాయుడు (మడ్డువలస) ప్రాజెక్టు. పక్కనే పంచ పాండవుల కొండ. ఈ రెండింటికి ముప్పు వాటిల్లేలా కొంతమంది బరితెగించారు. పాండవుల కొండపై అక్రమంగా కోట్లాది రూపాయల విలువైన గ్రానైట్ తవ్వకాలు చేపడుతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ తతంగమంతా పొరుగు జిల్లాకు చెందిన మంత్రి అనుచరుల అండదండలతో సాగిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపు కనీసం దృష్టిసారించలేదనే విమర్శలు వస్తున్నారుు.
 
వంగర:
అక్రమ మైనింగ్‌పై కొంతమంది కన్నేశారు. కోట్ల రూపాయల విలువైన కొండలను పిండి చేసేస్తున్నారు. పక్కా ప్లాన్‌తో, ఎటువంటి అనుమతులు లేకుండా గ్రానైట్‌ను కొల్లగొట్టేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ అక్రమ డిజైన్‌కు పచ్చరంగు పులుముకుంది. వంగర మండల పరిధి మడ్డువలస ప్రాజెక్టును ఆనుకొని ఉన్న పాండవుల పంచ కొండపై అక్రమంగా తవ్వకాలు చేపడుతున్నారు. వాస్తవంగా ఇది పటువర్థనం బౌండరీకి చెందిన కొండ అరుునా మడ్డువలసకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అటు వైపు ఎవరూ వెళ్లరూ.. అక్కడ ఏమి జరిగినా గోప్యమే. అందరి కళ్లు కప్పి ప్రారంభించిన ఈ గ్రానైట్ తవ్వకంపై అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ ప్రాంతంలో 35 ఏళ్ల క్రితం నుంచి ఎంటర్‌ప్రైజ స్ అండ్ ఎంటర్ పైజింగ్ కంపెనీ పేరుతో గ్రానైట్ క్వారీ నడుస్తుంది. ఆ క్వారీని అనుసరించినదే
 
కొత్తగా తవ్వకం చేపడుతున్న క్వారీ అని జనాన్ని అక్కడ బినామీ దారులు నమ్మించారు. సరేలే అనుమతి ఉన్న కొండ కదా అని జనం అంతా నమ్మి ఎవరి పని వారు చేసుకుంటున్నారు. అరుుతే ఇటీవల కొం త మంది దళారులు వంగర తహశీల్దార్ కార్యాలయానికి రావడాన్ని గమనించిన ‘సాక్షి’ ఆరా తీయగా అసలు రంగు బయటపడింది. అక్కడకు వెళ్లి చూడగా అనుమతులు లేని గ్రానైట్ కొండని, చేస్తున్నది అక్రమని తేలింది.

అక్రమంగా తవ్వకం !
మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టును అనుసరించి గ్రానైట్ కొండ ఉంది. దీన్ని పేలుడు పదార్థాలను వినియోగించి రారుుని కొల్లగొడుతున్నారు. పెద్ద పేలుళ్లు సంభవిస్తే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. గత నెల రోజులుగా నడుస్తున్న చీకటి పనుల్లో వందల సంఖ్యలో గ్యాంగ్‌సైజ్ బ్లాకులు కట్ చేశారు. వీటిపై కొనుగోలుదారుల పేరుతో ముద్రలు కూడా వేశారు. ఎవరికీ తెలియకుం డా వీటిని విక్రరుుంచేందుకు, పొరుగు క్వారీ పేరుతో గ్యాంగ్‌బ్లాకులు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కోట్లాది రూపాయల విలువ చేసే ఎరుుర్‌కంపర్షన్, రూప్‌కటింగ్ మిషన్, పొక్లరుునర్ వంటి భారీ యంత్రాలను కూడా గ్రానైట్ తవ్వకాలకు వినియోగిస్తున్నారు. రారుుని పేల్చేందుకు ప్రత్యేక పరికరాలను వాడుతున్నారు. కొండపైకి వెళ్లేందుకు పక్కా రహదారిని కూడా అక్రమార్కులు నిర్మించేశారు.

పొరుగు జిల్లా మంత్రి అండదండలతో...
పొరుగు జిల్లా అరుున విజయనగరానికి చెందిన ఓ మంత్రి అండదండలతో టీడీపీకి చెందిన ఈ ప్రాంత నాయకులు అక్రమ గ్రానైట్ తవ్వకాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు వస్తున్నారుు. విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులతో ఈ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు చేతులు కలిపి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది. రెవెన్యూ, మైనింగ్ శాఖల నుంచి ఎటువంటి అనుమతులు లేకపోరుునా ఇష్టారాజ్యంగా....గుట్టు చప్పుడు లేకుండా తవ్వకాలకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయల విలువైన బ్లాకులను ఇప్పటికే సిద్ధం చేసేశారు. అరుుతే ఇటీవల ఈ ప్రాంతంలో ఉన్న ఎంటర్‌ప్రైజస్ అండ్ ఎంటర్‌ప్రైజింగ్ కంపెనీ పేరుతో నడుస్తున్న గ్రానైట్ క్వారీని తనిఖీ చేసేందుకు వెళ్లిన అధికారుల దృష్టిలో అక్రమ గ్రానైట్ తవ్వకాలు పడినట్టు భోగట్టా.

ప్రతిష్టాత్మకం పాండవుల కొండ ..
పాండవుల కొండకు ఎంతోపేరుంది. కొండ వెనుక భాగంలో ప్రతిష్టాత్మక పాండవుల పంచ ఉంది. ద్వాపర యుగంలో పాండవులు ఈ ప్రాంతంలో సంచరించినట్లు కొండపై ఆనవాళ్లున్నారుు. ఇక్కడ ఉన్న ఓ గుహలో పాండవులు నివాసం ఉన్నట్లు పూర్వీకులు చెబుతుండేవారని ఈ ప్రాంతీయులు కథలుకథలుగా చెబుతుంటారు. ఇటువంటి ప్రాముఖ్యత ఉన్న కొండపై అక్రమ గ్రానైట్ తవ్వకాలు చేయడంపై ఈ ప్రాంతీయుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది.
 
ఎవరికీ లీజుకు ఇవ్వలేదు
పటువర్థనం గ్రామం పరిధిలో ఈ కొండ బౌండరీ ఉంది. 341 సర్వే నంబరులో ఐదెకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతం ఉంది. అరుుతే ఈ కొండ ప్రాంతం ఏ ఒక్కరికీ లీజుకు ఇవ్వలేదని వీఆర్‌ఓ పి.సుధాకర్ నివేదిక ఇచ్చారని తహశీల్దార్ పందిరి అప్పారావు ‘సాక్షి’కి తెలిపారు.

మైనింగ్ ఏడీ ఏమన్నారంటే..
 మైనింగ్‌శాఖ ఏడీ ప్రసాదరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా ఇటీవల క్వారీని తనిఖీ చేసి నిర్వహకులకు నోటీలు అందజేశామన్నారు. 

మరిన్ని వార్తలు