అక్రమ సంబంధ లేఖల కలకలం

2 Jun, 2017 14:19 IST|Sakshi
అక్రమ సంబంధ లేఖల కలకలం

► ఒక వృద్ధుడి నిర్బంధం
► నాలుగు కుటుంబాల వారు ఆందోళన, ఆత్మహత్యాయత్నం
► వృద్ధుడి అరెస్టుతో సద్దుమణిగిన వివాదం


మండలంలోని రావులపాడులో గురువారం తెల్లవారుజామున ఒక వృద్ధుడు.. కొన్ని కుటుంబాల వారి మధ్య అక్రమ సంబంధాలు నడుస్తున్నాయంటూ విసిరిన కాగి తాలు స్థానిక ఎస్సీ పేటలో వెదజల్లడం కలకలం రేపింది. స్థానికులు అతడిని పట్టుకుని రామాలయంలో నిర్బం ధించారు. ఆ కుటుంబాల వారు  తీవ్ర ఆవేదనకు గురై ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి కుదుటపడింది.

రావులపాలెం (కొత్తపేట) : ఎస్సీ పేటకు చెందిన పమ్మి శ్రీను తదితర నాలుగు కుటుంబాలకు చెందిన వ్యక్తులకు అక్రమ సంబంధాలు నడుస్తున్నాయంటూ సుమారు ఆరు నెలలుగా అసభ్యకరంగా రాసిన లేఖలు పోస్టు ద్వారాను, రాత్రి ఇళ్ల వద్ద పడేస్తూ ఆ కుటుంబాలను గుర్తుతెలియని వ్యక్తులు మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో స్థానికులు నిఘా పెట్టారు. గురువారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన వృద్ధుడు చిలుకూరి శ్రీరామమూర్తి మోటరు సైకిల్‌పై వచ్చి అసభ్యకరంగా రాసిన లేఖలను వెదజల్లుతుండగా పమ్మి శ్రీను తదితరులు పట్టుకున్నారు. దీంతో అతడిని రామాలయం వద్ద నిర్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీఐ బి.పెద్దిరాజు, ఎస్సై సీహెచ్‌ విద్యాసాగర్‌ అక్కడికి చేరుకుని వృద్ధుడిని అప్పగించమని కోరారు.

వృద్ధుడిని తీసుకువెళఙతే ఆత్మహత్య చేసుకుంటామని పలువురు ఒంటి కిరోసిన్‌ పోసుకుపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో సర్పంచ్‌ నెక్కంటి వెంకన్న, పెచ్చెట్టి చిన్నారావు, గ్రామపెద్దలు, దళిత నాయకులతో  సీఐ పెద్దిరాజు చర్చించారు. ఆ ప్రాంతానికి చెందిన ఒక యువతి, పొడగట్లపల్లికి చెందిన మరో వ్యక్తితో లేఖలు రాయించినట్టు వృద్ధుడు చెప్పాడు. కేసు నమోదు చేసి అందరినీ అరెస్టు చేస్తామని, బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేస్తామని సీఐ నచ్చజేప్పడంతో ఆందోళనకారులు శాంతించారు. దీంతో వృద్ధుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ వివాదం తెల్లవారు జామున మూడు గంటల నుంచి సాయంత్రం వరకూ కొనసాగింది

>
మరిన్ని వార్తలు