పెరిగిన వేతనాలు అమలు చేయాలి

9 Aug, 2016 18:16 IST|Sakshi
ఏలూరు (సెంట్రల్‌) : కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 151 జీవో ప్రకారం జిల్లాలోని అన్ని మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వర్తింప చేయాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధనాల వెంకటరావు, బి.సోమయ్య డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం అన్ని విభాగాల కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి నెలకు రూ.11 వేలు మాత్రమే ఇస్తున్నారని, దానిని ప్రస్తుత జీవోను అనుసరించి పారిశుధ్య కార్మికులకు రూ.12 వేలు, ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న వారికి రూ.15 వేలు, కంప్యూటర్‌ ఆపరేటర్లకు రూ.17,500 పెంచాల్సి ఉందని, మునిసిపాలిటీలో జీవో అమలు కోసం డీఎంఏని కలిసి ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతామని వారు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు