ఉద్దేశ్యం మంచిదే.. ఆచరణలో వికటించింది

14 Nov, 2016 21:40 IST|Sakshi
  • రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
  • దేవీచౌక్, కల్చరల్‌ (రాజమహేంద్రవరం) :
    పెద్ద నోట్ల రద్దు ఉద్దేశ్యం మంచిదే అయినా, ఆచరణలో వికటించిందని చాంబర్‌ ఆఫ్‌ కామర్సు రాష్ట్ర కన్వీనర్‌ అశోక్‌కుమార్‌ జై¯ŒS అన్నారు. లోక్‌సత్తా పౌర నిఘా వేదిక ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఇండియా ఇండిపెండె¯Œ్స సెంటరులో ఆర్థిక నిపుణులు, న్యాయవాదులు, రాజకీయవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పెద్ద నోట్ల రద్దులో చట్ట నిబద్ధత అనే అంశంపై సోమవారం జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో జై¯ŒS మాట్లాడారు. నోట్ల రద్దు సంగతి కొందరికి ముందే తెలిసిపోయిందన్నారు. సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కార్యకర్త జె.రవి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల కొమ్ముకాస్తోందని విమర్శించారు. జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిప్రతినిధి బీఎ¯ŒS వర్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు సీబీఐ వంటి దర్యాప్తు సంఘాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.రాష్ట్ర బార్‌ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు సమావేశానికి పంపిన సందేశంలో ముందుగానే అస్మదీయులకు లీకులు ఇచ్చి, అన్నీ సర్దుకున్నాక ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు మాట్లాడుతూ హోం వర్కు చేయకుండా తీసుకున్న చర్య అన్నారు. ఖాతాదారునిపై నిబంధనలు విధించడం చట్ట విరుద్ధమని లోక్‌సత్తా పౌర నిఘా వేదిక కన్వీనర్‌ ఎంవీ రాజగోపాల్‌ పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతపాటిశర్మ మాట్లాడుతూ సముద్రంలో నీరు ఎంత ఉన్నా, దాహం తీరడానికి గుక్కెడు నీరు లేకపోతే ప్రయొజనం లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS అల్లు బాబి మాట్లాడుతూ హీరోలు కావాలనుకుని నేతలు జీరోలయ్యారని విమర్శించారు. ఆడిటర్‌ టి.వీరభద్రరావు, న్యాయవాది వల్లూరి సురేష్, జె.కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు