3 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం

3 Aug, 2016 19:22 IST|Sakshi
3 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం
ఏలూరు (మెట్రో): జిల్లాలో ప్రస్తుత సంవత్సరంలో 3 వేల ఎకరాల్లో ప్రకతి వ్యవసాయం చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్టు కలెక్టర్‌ కె.భాస్కర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రాధాన్యతా రంగాలైన వ్యవసాయం, పశుసంవర్ధక, ఉద్యాన శాఖ, బిందు సేద్యం, మార్కెటింగ్‌ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రభుత్వం ప్రకతి వ్యవసాయంపై దృష్టి కేంద్రీకరించిందని, ఈ మేరకు జిల్లాలో రైతులను సంసిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుతం 812 మంది రైతులు 1,150 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని, వారికి 300  ఆవులను రూ.10 వేల సబ్సిడీతో అందించనున్నట్టు చెప్పారు. కషాయాలు, ఇతర వనరులు విక్రయించేందుకు 50 ఎంపీఎం దుకాణాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ప్రకతి వ్యవసాయం చేయాలనుకునే రైతులు సూచనలు, సలహాలు, ఉపకరణల కోసం 88866 13023 నంబరులో సంప్రదించాలని సూచించారు. సీపీవో టి.సురేష్‌కుమార్, ఏడీ  సాంబశివరావు, వ్యవసాయశాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, ఎల్‌డీఎం ఎం.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉద్యాన శాఖ ఏడీలు దుర్గేష్, విజయలక్ష్మి, మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ నాగమల్లిక తదితరులు పాల్గొన్నారు.  
పెండింగ్‌ దరఖాస్తులను పరిష్కరించాలి.. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ భాస్కర్‌ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన పారిశ్రామిక అభివృద్ధి కౌన్సిల్‌ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు. ఈనెల 10లోపు ఆటోనగర్‌ను నిర్దేశించిన ప్రదేశానికి తరలించాలని ఆదేశించారు. పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ఆదిశేషు, పి.ఏసుదాసు, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ రంగలక్ష్మీదేవి, కమర్షియల్‌ టాక్స్‌ అధికారి కేదారేశ్వరరావు  పాల్గొన్నారు.
35 శాతం సబ్సిడీతో కార్లు.. జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద 35 శాతం సబ్సిడీ వర్తింపజేస్తూ అర్హులకు 100 ఇన్నోవా కార్లను అందించనున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. పారిశ్రామిక అభివృద్ధి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ లబ్ధిదారులకు 100 ఇన్నోవా కార్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. వివరాలకు జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం, సెల్‌ 96409 09821 నంబరులో సంప్రదించాలని సూచించారు.  
ఇవేం రోడ్లు..జిల్లాలో రోడ్ల పరిస్థితిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లు వేసిన ఆరు నెలలుకే అధ్వానంగా మారితే ఎలా అని ప్రశ్నించారు. కలెక్టరేట్‌లో ఆర్‌అంyŠ బీ అధికారులతో రోడ్లు, బ్రిడ్జిలు, భవనాల నిర్మాణ ప్రగతి తీరుపై సమీక్షించారు. జిల్లాలో నిర్మించే ప్రతి రోడ్డూ నాణ్యతా ప్రమాణాలతో లేకపోతే సంబంధిత ఏఈ, డీఈను సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు. ఆర్‌ అండ్‌బీ ఎస్‌ఈ ఎంబీ నిర్మల, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. 
నత్తనడకన నిర్మాణాలు.. జిల్లాలో అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు వేగిరపర్చాలని కలెక్టర్‌ కె.భాస్కర్‌ పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ మాణిక్యం, ఈఈ రఘుబాబు, రామన్న, ప్రకాశ్‌ పాల్గొన్నారు. 
తొలివిడత జలసిరి పూర్తి.. జిల్లాలో ఎన్టీఆర్‌ జలసిరి తొలివిడత పూర్తయ్యిందని కలెక్టర్‌ భాస్కర్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో ఎన్టీఆర్‌ జలసిరి పథకంపై అధికారులతో సమీక్షించారు. మొదటి విడతతో 1,971 మంది రైతులకు బోర్లు మంజూరు చేశామని, రెండో విడతలో భాగంగా 1,592 దరఖాస్తులు రైతుల నుంచి అందాయని చెప్పారు. డ్వామా ఏపీడీ ఎస్‌వీవీ సత్యనారాయణ, టి.నాగరాజు, విద్యుత్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు. 
 
 
  
 
 
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా