అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత సంచారం

28 Aug, 2016 00:44 IST|Sakshi
అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత సంచారం

 

  • ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు

చండ్రుగొండ: అబ్బుగూడెం అడవుల్లో మరో చిరుత పులి సంచరిస్తున్న ఆనవాళ్ళు లభించాయి. పాదాల గుర్తుల ఆధారంగా అటవీశాఖ అధికారులు ధ్రువీకరించారు. గతనెల 3వ తేదీన ఇదే ప్రాంతంలోని అడవుల్లో రెండు చిరుత పులులను విషప్రయోగం చేసి హతమార్చిన విషయం తెలిసిందే. విధుల్లో భాగంగా అటవీప్రాంతంలో సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తున్న సెక్షన్‌ అధికారిణి దేవికి ఈ చిరుత పులి పాదాల గుర్తులు కనిపించాయి. సమాచారాన్ని ఆమె శాఖ ఉన్నతాధికారులకు అందించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సమీపంలో నీటివనరులున్న ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అబ్బుగూడెం అటవీప్రాంతంలో చిరుత సంచరిస్తోంది వాస్తవమేనని రామవరం రేంజర్‌ మధుసూదన్‌రావు పేర్కొన్నారు. మేకలు, పశువుల కాపరులు అటుగా వెళ్లవద్దని సూచించారు.

మరిన్ని వార్తలు