పంద్రాగస్టు వేడుకల్లో జనగామ కళాకారులు

13 Aug, 2016 00:27 IST|Sakshi
  • ఢిల్లీ, హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమాల్లో ‘ఒగ్గు’ బృందం 
  • 220 మందిని గుర్తించిన రాష్ట్ర సాంస్కృతిక విభాగం 
  • జనగామ : ఢిల్లీ, హైదరాబాద్‌ గోల్కొండ కోటలో జరిగే పంద్రాగస్టు వేడుకల్లో  ప్రదర్శన నిర్వహించేందుకు జనగామ ఒగ్గు కళాకారులు ఎంపికయ్యారు. జనగామ, బచ్చన్నపేట, మద్దూరు, లింగాలఘనపురం మండలాలకు చెందిన 200 మంది కళాకారులను రాష్ట్ర సాంస్కృతిక విభాగం గుర్తించింది. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో వీరు వివిధ రూపాల్లో ప్రదర్శన ఇవ్వనున్నారు. భారత ప్రభుత్వం పంద్రాగస్టు వేడుకలను పురస్కరించుకుని ఈ నెల16న ఢిల్లీలో నిర్వహించే  ‘భారత్‌ పర్వు’ సాంస్కృతిక కార్యక్రమంలో నైపుణ్యాన్ని చాటేందుకు మరో 20 మంది కళాకారులు వెళ్లనున్నారు. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించే ప్రదర్శనల్లో పాల్గొనేందుకు ఈ నెల14న జనగామ నుంచి కళాకారులు బయలుదేరనున్నట్లు సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్‌ రవికుమార్‌ తెలిపారు. సాంస్కృతిక విభాగం రాష్ట్ర డైరెక్టర్‌ మామిడి హరిక్రిష్ణ, టూరిజం, కల్చరర్‌ ఎండీ బుర్రా వెంకటేÔ¶ ం కృషితో  జనగామ ఒగ్గుకళాకారులకు అరుదైన అవకాశం లభించిందన్నారు.  
మరిన్ని వార్తలు