సార్వత్రిక సమ్మెలో నిరసన ప్రదర్శన

28 Aug, 2016 19:42 IST|Sakshi

నల్లగొండ టూటౌన్‌ : సెప్టెంబర్‌ 2న చేపడుతున్న దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో డిమాండ్ల బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన చేయాలని టీఎస్‌ యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌. రాములు కోరారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్‌ భవన్‌లో జరిగిన యూటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సమ్మె జయప్రదం కోసం ఉపాధ్యాయులు డివిజన్‌ కేంద్రాల్లో ప్రదర్శనలు చేయాలని కోరారు. సీపీఎస్‌ విధానం కోసం దశల వారిగా పోరాటాల్లో పాల్గొనలన్నారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్‌ రూల్స్‌ రూపొందించి పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. భాషా పండితుల, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. ప్రతి 40 ఉన్నత పాఠశాలలకు ఒక ఉప విధ్యాధికారిని నియమించి, ప్రాథమిక పాఠశాలల సంఖ్య 50 దాటితే అదనంగా మరో ఎంఈను నియమించాలని కోరారు. సమావేశంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎం. రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎన్‌. సరళ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పి. లక్‌పతినాయక్, పెరుమాళ్ల వెంకటేశం, యాదయ్య, బి. అరుణ, తిరుమలయ్య, ధనమూర్తి, బి. శ్రీనివాసాచారి, నాగమణి, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు