‘నకిలీ బంగారం’ కేసులో ఇద్దరి అరెస్ట్‌

30 Aug, 2016 23:48 IST|Sakshi
‘నకిలీ బంగారం’ కేసులో ఇద్దరి అరెస్ట్‌

నర్సంపేట: నకిలీ బంగారం కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ జాన్‌దివాకర్‌ సోమవారం తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. గత రెండు నెలల క్రితం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం ఎదురుగా ఉన్న పాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ యజమాని రవిని ప్లాస్టిక్‌పూలు, ప్లాస్టిక్‌ దండల తయారు చేసే శివ, చిన్న, గణేష్, రవి, అంచలయ్య వచ్చి పరిచయం చేసుకున్నారు. కౌంజు పిట్టలను తీసుకొచ్చి రవికి రెండుసార్లు అమ్మారు. మరోసారి అతడి దగ్గరికి వచ్చి జేసీబీతో మట్టి తవ్వతుండగా అందులో బంగారుహారం దొరికిందని వారు అతడితో నమ్మబలికారు. హారం సుమారు 3 కేజీలు ఉంటుందని, రూ.90 లక్షల విలువ ఉంటుందని, నీౖకైతే రూ.30 లక్షలకు ఇస్తామని చెప్పారు.

అవసరమైతే బంగారాన్ని పరీక్షించుకోమ్మని నమ్మబలికారు. దీంతో రవి రూ.15లక్షలు ఇచ్చి మూడు కేజీల హారాన్ని తీసుకున్నాడు. ఇలాగే గుండ్లపహాడ్‌లో గ్రామంలో కూడా చెరువు వద్ద సాంబయ్యను కూడా నమ్మించారు. అతడు రూ.3 లక్షల ఇచ్చిన తర్వాత విజయవాడకు తీసుకెళ్లి హారాన్ని అప్పగించారు. తీరా ఆ హారాలను బాధితులు పరీక్షించగా నకిలీవని తేలడంతో బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ నెల 28న పాకాల రోడ్డులోని శరణ్య చికెన్‌ సెంటర్‌లో మిగిలి ఉన్న నకిలీ బంగారాన్ని అమ్మ్మడానికి రాగా శరణ్య చికెన్‌ సెంటర్‌ యజమాని శ్యాంసుందర్‌ దానిని తీసుకునేందుకు నిరాకరించాడు.

ఈ క్రమంలోనే పట్టణంలోని బస్టాండ్‌ సెంట ర్‌లో రాణా బయ్యప్ప అలియాస్‌ రవి, రాణా మనోహర్‌ అలి యాస్‌ గణేష్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకితీసుకొని, వారి వద్ద ఉన్న నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఇద్దరిని విచారించగా గోవిందు శ్రీనివాస్‌ అలియాస్‌ చిన్న, నాగరాజు అలియాస్‌ శివ, రాణా అంచలయ్య మొత్తం ఐదుగురు కలిసి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వారిలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ జాన్‌దివాకర్‌ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు హరికృష్ణ, దివాకర్, ఏఎస్సై కమలాకర్, సిబ్బంది మల్లేశం, రాజు, కుమారస్వామి, రవీం దర్, నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు