ఆగని ఆందోళనలు

9 Oct, 2016 00:32 IST|Sakshi
ఆగని ఆందోళనలు
  • బస్సు అద్దాలను పగులగొట్టిన ఆందోళనకారులు
  • అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో  
  • ములుగు : ములుగు జిల్లా కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, జిల్లా సాధన సమితి «నాయకులు మండలకేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సమ్మక్క–సారలమ్మ తల్లులు కేసీఆర్‌ కళ్లు తెరిపించండి అంటూ వేడుకున్నా రు. ఆందోళనకారులు ఆగిఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలు పగులకొట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఏఎస్పీ విశ్వజిత్‌ కాంపాటి, సీఐ శ్రీనివాస్‌రావు, ఎస్‌సై మల్లేశ్‌యాదవ్‌లు బస్సు ను పరిశీలించారు. కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం నాయకులు చేతి లో మందు డబ్బాలు పట్టుకొని నిరసన తెలి పారు.    ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనసరి సీతక్క మాట్లాడుతూ తలనైనా నరుక్కుంటాను తప్పా మాట తప్పనని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌ 2014 మేడారం జాతర సమయంలో అమ్మవార్ల సాక్షి గా ములుగు జిల్లా చేస్తానని హామీ ఇచ్చి ప్రస్తు తం మాట తప్పారని ఆరోపించారు.
     
    ప్రజల్లో లేనిపోని ఆశలు రేపి నేడు వీలు కాదు అంటూ సున్నితంగా అంశాన్ని పక్కకబెట్టడం సరికాద న్నారు. ప్రభుత్వం స్పందించకపోతే నియోజకవర్గం నుంచి వెళ్తున్న గోదావరి జలాలు, ఇసుక సంపదను అడుగుకూడా కదలనివ్వబోమని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ జెడ్పీఫ్లోర్‌లీడర్‌ సకినాల శోభన్‌మాట్లాడుతూ అన్ని రకాలుగా అర్హతలు ఉన్నా ములుగును జిల్లా చేయకపోవడం సరికాదన్నారు. ప్రాంత ప్రజల మనోభావాల ను సీఎం కేసీఆర్‌ గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాజకీయ జేఏసీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి, జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ చింతలపూడి భాస్కర్‌రెడ్డి, టీడీపీ, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ ల అధ్యక్షులు పల్లె జయపాల్‌రెడ్డి, గట్టు మహేందర్, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుగులోతు కిషన్, నాయకులు కుమార్, భిక్షపతి, చంద్రమౌళి,  శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు   
>
మరిన్ని వార్తలు