పోలీస్‌ గౌరవాన్ని పెంచండి

16 Sep, 2016 22:48 IST|Sakshi
పోలీస్‌ గౌరవాన్ని పెంచండి
– బదిలీ ఎస్‌ఐలు, ప్రొబేషనరీ ఎస్‌ఐలతో ఐజీ సమీక్ష 
 
కర్నూలు: నిజాయితీగా వ్యవహరించి పోలీసు శాఖ గౌరవాన్ని పెంచాలని రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు, కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్, ఎస్పీ ఆకె రవికష్ణ తదితరులు క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి బదిలీ అయిన ఎస్‌ఐలు, ప్రొబేషనరీ ఎస్‌ఐలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఐజీ శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడకుండా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా ప్రజల మన్ననలు పొంది పోలీసు శాఖ గౌరవాన్ని పెంచాలన్నారు. వత్తి ధర్మాన్ని కాపాడుతూ సమస్యలు ఉంటే పైఅధికారుల దష్టికి తీసుకువచ్చి మానవతా విలువలతో ప్రజలకు న్యాయం చేయాలన్నారు. ప్రతి విషయాన్ని సమస్యగా భావించకుండా పరిష్కారానికి ప్రయత్నించాలన్నారు. సమస్యలపై స్టేషన్‌ను ఆశ్రయించే బాధితులను కుటుంబీకులుగా భావించినప్పుడే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ మ్యానువల్‌ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. నైపుణ్యాన్ని పెంచుకుని సమాజానికి దోహదపడాలన్నారు. కేటాయించిన పోలీస్‌ స్టేషన్‌లో సక్రమంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ బాబుప్రసాద్, ఆర్‌ఐ రంగముని, బదిలీ అయిన ఎస్‌ఐలు, ప్రొబేషనరీ ఎస్‌ఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు