పెరిగిన మధ్యాహ్న భోజన పథకం ధరలు

25 Sep, 2016 19:40 IST|Sakshi
పెరిగిన మధ్యాహ్న భోజన పథకం ధరలు
  • ఈనెల నుంచే అమలు 
  • సుల్తానాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి పెరిగిన నిత్యావసరాల ధరలకనుగుణంగా ధరలు పెంచినట్లు డీఈవో శ్రీనివాసాచారి ఎంఈవోలకు ప్రొసీడింగ్‌లు పంపించారు. జిల్లా వ్యాప్తంగా పీఎస్‌లు 1973, యూపీఎస్‌లు 339, హైస్కూల్‌లు 704 ఉన్నాయి. ఇందులో 2లక్షల52వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి రోజువారిగా మధ్యాహ్నాభోజన పథకం వండి పెట్టే నిర్వాహకులకు కోడిగుడ్డు అందించేందుకు 01.09.2016 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని ప్రధానోపాధ్యాయులు ఎంఈవోలకు ఎప్పటికప్పుడు అందించాలని పేర్కొన్నారు. 
    30.06.2015 31.08.2016 01.09.2016 (ధర రూ.లలో)
    ప్రైమరీ స్కూల్‌ 3.86 4.86 5.86
    యూపీఎస్‌ 5.78 6.78 7.78
    హైస్కూల్‌ 5.78 6.78 7.78 
     
     
మరిన్ని వార్తలు