బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను కాలేజీ స్థాయికి పెంపు

28 Jul, 2016 01:06 IST|Sakshi

నల్లగొండ: రాష్ట్రంలో వెనకబడిన కులాలకు చెందిన విద్యార్థులకు విద్యనందిస్తున్న రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ను ఇంటర్మీడియట్‌ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16 రెసిడెన్షియల్‌ పాఠశాలలు  ఉండగా జిల్లాలో నాగార్జునసాగర్‌ (బాలురు), మూసీ ప్రాజెక్టు (బాలురు) వద్ద రెండు స్కూల్స్‌ ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే రెసెడిన్షియల్‌ స్కూల్స్‌లో ఇంటర్‌ అడ్మిషన్‌లు ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తొలిసారిగా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, ఎంఈసీ గ్రూపులు ప్రవేశపెట్టారు. అందుకు అవసరమయ్యే బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
 

మరిన్ని వార్తలు