మహిళా భాగస్వామ్యంతోనే దేశ ప్రగతి

27 Jul, 2016 01:31 IST|Sakshi
సాగర్‌నగర్‌ : అమెరికా వంటి అభివద్ధి చెందిన దేశాలతో భారత్‌ పోటీపడి ఆర్థిక ప్రగతి సాధించాలంటే.. దేశంలో మహిళలను అన్ని రంగాల్లో పొత్రహించడం ద్వారా మాత్రమే సాధ్యమని మహిళ పారిశ్రామికవేత్త, ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌ దక్షిణ ప్రాంత డిప్యూటీ ఛైర్‌ఉమెన్‌ వనితా దాట్ల పేర్కొన్నారు. గీతం విశ్వవిద్యాలయం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఇటీవల జరిగిన కొన్ని జాతీయస్థాయి అధ్యయనాల్లో దేశంలోని మహిళల్లో కేవలం ఆరుశాతం మంది మాత్రమే ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారని.. నిజానికి దేశంలోని అక్షరాస్యత గల మహిళల సంఖ్యను తీసుకుంటే మరో 48శాతం మంది మహిళలు అవకాశాలు పొందటానికి అర్హులుగా తేలిందన్నారు. మహిళల ఆలోచనా విధానం, వివిధ అంశాలపై పారదర్శకతతో వ్యవహరించడం వల్ల మంచి పారిశ్రామికవేత్తలుగా రాణించగలిగే సత్తా ఉంటుందన్నారు. దేశ స్థూల జాతీయోత్పిత్తిలో మహిళలు పది శాతం మేరకు సహకరిస్తే ఆర్థిక రంగంలో 8 శాతం వద్ధి త్వరితంగా సాధ్యపడుతుందన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ కె. మంజుశ్రీనాయుడు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు