భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి

23 Aug, 2016 21:23 IST|Sakshi
భారత సంస్కృతికి ప్రపంచ ఖ్యాతి
ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల
 
అమరావతి (గుంటూరు రూరల్‌) : సంప్రదాయాలను కాపాడుకోవటం మన ధర్మమని, భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయని ప్రముఖ సినీ గేయరచయిత, పేరడీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు అన్నారు. మంగళవారం అమరావతిలోని అమరలింగేశ్వర ఘాట్‌లో ఆయన కుటుంబసభ్యులతో కలిసి పుష్కర స్నానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా నదిలో పుష్కర స్నానం చేయటం వల్ల పుణ్యంతోపాటు ఆరోగ్యం లభిస్తుందన్నారు. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి వ్యక్తికి ఉందన్నారు. అనంతరం అమరేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని వార్తలు