-

పరిశ్రమకు పంటభూములే కావాలా?

3 Oct, 2016 01:34 IST|Sakshi
  • బీడు, బంజరు భూముల్లో ఏర్పాటు చేయాలి
  • రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహారెడ్డి
  • ముగిసిన రైతుల దీక్షలు  
  • గీసుకొండ : జిల్లాలో విస్తారంగా బీడు, బంజరు భూములు ఉండగా పరిశ్రమల కోసం రైతుల భూములను ఎలా సేకరిస్తారని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
    మండలంలోని ఊకల్‌ క్రాస్‌రోడ్డు వద్ద టెక్స్‌టైల్‌ పార్కు కోసం పంట భూములను ఇవ్వమంటూ రైతులు చేపట్టిన దీక్షల ముగింపు సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 28 వేల ఎకరాల బీడు భూములు ఉండగా బలవంతంగా రైతుల భూములను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి , రైతు సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు మోర్తాల చందర్‌రావు, కూసం రాజమౌళి, శ్రీనివాస్, రమేశ్, రంగయ్య, సమ్మిరెడ్డి, భూ పరిరక్షణ కమిటీ నాయకులు  నర్సింగరావు, రవీందర్‌గౌడ్‌లు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు