‘ఎల్లంపల్లి’కి తగ్గిన ఇన్‌ఫ్లో

6 Oct, 2016 23:31 IST|Sakshi
రామగుండం : ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్‌ఫ్లో గురువారం భారీగా తగ్గింది. పక్షం రోజులు లక్షల క్యూసెక్కుల్లో వచ్చిన ఇన్‌ఫ్లో ప్రస్తుతం 36,539 క్యూసెక్కులకు చేరింది. దీంతో ప్రాజెక్టు అధికారులు రెండు గేట్ల ద్వారా 21,095 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి  నీటి మట్టం 148.00 మీటర్లకు ప్రస్తుతం 147.55 మీటర్లు ఉంది. 20.175 టీఎంసీల నీటికి  18.92 టీఎంసీలు నిల్వ ఉంది. 
 
 
మరిన్ని వార్తలు