' సైకోలు ఎంతమందనేది నిర్థారణ కాలేదు'

27 Aug, 2015 10:41 IST|Sakshi
' సైకోలు ఎంతమందనేది నిర్థారణ కాలేదు'

ఏలూరు : మహిళలపై సైకో చేస్తున్న ఇంజక్షన్ దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ స్పష్టం చేశారు. గురువారం ఏలూరులో ఎస్పీ భాస్కర్ భూషణ్ మాట్లాడుతూ...ఈ కేసును నర్సాపురం డీఎస్పీ సౌమ్యలతకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మహిళలపై దాడులు చేస్తున్నది సైకోగా భావిస్తున్నామన్నారు.

ఈ ఇంజక్షన్ సైకోలు ఎంతమంది ఉన్నారనేది ఇంతా ఓ నిర్ధారణ కాలేదని తెలిపారు. ఇంజక్షన్ సైకో దాడులను అరికట్టేందుకు 25 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. అలాగే 45 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆగంతకుడు ఇంజక్షన్ సూది మాత్రమే వాడుతున్నాడన్నారు. ఇంజక్షన్లో ఎలాంటి హానికరమైనవి లేవని ల్యాబ్ టెస్ట్లో రుజువైందని భాస్కర్ భూషణ్ చెప్పారు.

మరిన్ని వార్తలు