ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

26 May, 2017 22:58 IST|Sakshi
- 2014 సంవత్సరంలో పంట నష్టం
- ఐదు మండలాలకు రూ.73,24,66,362 విడుదల
 
కర్నూలు(అగ్రికల్చర్‌): 2014 సంవత్సరంలో ఎంపికైన కరువు మండలాలకు ఎట్టకేలకు ప్రభుత్వం ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పట్లో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా.. పత్తికొండ, చిప్పగిరి, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు మండలాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ మండలాల్లో 82,058 మంది రైతులు 75,515.26 హెక్టార్లలో పంటలు కోల్పోయారు. వీరికి పెట్టుబడి రాయితీ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.73,24,66,362 విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ పరిహారాన్ని గత ఏడాదే విడుదల చేయగా, ట్రెజరీలో బిల్లులు ల్యాప్స్‌ అయ్యాయి. ఇందువల్ల ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది.
 
మరిన్ని వార్తలు