ఉద్యాన రైతులకు ‘ఇన్‌పుట్‌’ మంజూరు

18 Sep, 2017 22:51 IST|Sakshi

అనంతపురం అగ్రికల్చర్‌:

        జూన్‌ 2016లో అకాల వర్షాలకు దెబ్బతిన్న పండ్లతోటలకు సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) కింద పరిహారం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డి.మన్మోహన్‌సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, తూర్పు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా జిల్లాల పరిధిలో 2,138 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినగా 5,247 మంది రైతులకు రూ.5.19 కోట్లు పరిహారం మంజూరు చేశారు. అందులో జిల్లా వాటా రూ.90 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు