గుంటూరు ఘటనపై విచారణకు ఆదేశం

14 Sep, 2016 19:49 IST|Sakshi

 గుంటూరు బోధనాసుపత్రిలో బతికుండగానే మరణ ధృవీకరణ పత్రాన్ని అందచేసి, బిడ్డను ఇంటికి పంపిన ఘటనపై విచారణకు ఆదేశించినట్టు వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎన్.సుబ్బారావు వెల్లడించారు. ఈ ఘటనకు బాధ్యురాలైన గైనకాలజీ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తక్షణమే సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఈ బిడ్డ వైద్యానికి వచ్చిన సమయంలోనే గైనకాలజీ వైద్యురాలికి మరో రెండు కేసులకు ట్రీట్‌మెంట్ చేయాల్సి వచ్చిందని, ఈ కేసును గైనకాలజీ పీజీ చదివే విద్యార్థిని చూసిందన్నారు. ఈ విద్యార్థినికి అవగాహన లేక బిడ్డ మృతి చెందినట్టు మరణ ధృవీకరణ ఇచ్చిందన్నారు. ఒక బిడ్డకు మరణ ధవీకరణ పత్రం పీజీ చదివే స్టూడెంట్ ఇవ్వకూడదని, తప్పకుండా అదే సమయంలో విధుల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుమతి తీసుకోవాల్సి ఉందని అన్నారు. ఏదేమైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధ్యురాలేనని అందుకే సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పీజీ విద్యార్థినులందరికీ వారం రోజుల పాటు ఓరియంటేషన్ తరగతులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

 

మరిన్ని వార్తలు