రాష్ట్ర రహదారులపై తనిఖీలు

10 Sep, 2016 00:00 IST|Sakshi
రాష్ట్ర రహదారులపై తనిఖీలు
 
నగరంపాలెం(గుంటూరు): జిల్లాలోని రాష్ట్ర రహదారులపై ఉన్న ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి వాటిని ప్రమాదరహిత ప్రాంతాలుగా సరిదిద్దేందుకు రవాణా పోలీసు, ఆర్‌ అండ్‌ బీ అధికారులు సంయుక్తంగా శుక్రవారం తనీఖీలు నిర్వహించారు. నల్లపాడు రోడ్డు తనీఖీల్లో పాల్గొన్న జిల్లా ఉప రవాణా కమిషనర్‌ జీసీ రాజరత్నం మాట్లాడుతూ గతేడాది అక్టోబరు 30, 31 తేదీల్లో జిల్లాలోని 14 రాష్ట్ర రహదారులపై సంయుక్త తనీఖీ చేసి ప్రమాద ప్రాంతాలను గుర్తించి తగు చర్యలు నిమిత్తం సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. దీనిపై ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారులు ప్రమాదకర ప్రాంతాలను సరిచేసి ప్రమాద రహితంగా మార్చామని రవాణా కమిషనర్‌కు తెలిపారని,  కమిషనర్‌ ఆదేశాల మేరకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు నిర్వహించిన మరమ్మతులు పరిశీలించడం కోసం జిల్లాలో 14 ప్రత్యేక బృందాలతో తనిఖీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నివేదికను రవాణా కమిషనర్, ఇతర శాఖ అధికారులకు అందిస్తామని వివరించారు. 
 
>
మరిన్ని వార్తలు