బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవ

1 Aug, 2016 00:43 IST|Sakshi
ఎమ్మెల్యేలను సత్కరిస్తున్న సంఘం నేతలు
ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ 
మహబూబ్‌నగర్‌ కల్చరల్‌: కుల రహిత సమాజం కోసం పాటు పడిన బసవేశ్వరుడిని స్ఫూర్తిగా తీసుకొని, ధార్మిక, సామాజిక సేవల్లో తరించాలని ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. వీరశైవ లింగాయత్‌ –లింగబలిజ సంఘం జిల్లా శాఖ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఆదివారం స్థానిక గోపాల్‌రెడ్డి గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ‘కాయకమే కైలాసం’ (కçష్ట పడితేనే ముక్తి, భుక్తి) అంటూ చాటి చెప్పిన బసవేశ్వరుడు  గొప్ప మానవతా వాది అన్నారు. 12వ శతాబ్దంలోనే ‘అనుభవ మండపం’ అనే పార్లమెంటను ఏర్పాటు నిర్వహించారని గుర్తు చేశారు. బసవేశ్వరుడి జయంతిని అధికారికంగా నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్‌లకు తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
 
బీసీలో చేర్చిన ఘనత వైఎస్‌దే..
ఆ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సంగేశ్వర్‌ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి 2009లో తయ కులస్థులను బీసీల్లో చేర్చారని అన్నారు. ఓబీసీలుగా గుర్తించేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. అనంతరం రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి శివరత్నం నూతన కార్యవర్గ సభ్యులచే పదవీ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి  రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నేతలువన్నె ఈశ్వరప్ప,కవితా దేశ్‌ముఖ్, శేఖర్, పవన్, రేణుక,సోమశేఖర్, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్, జేపీఎన్‌సీఈ చైర్మెన్‌ కేఎస్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు