సత్వర న్యాయమే లోక్‌అదాలత్‌ లక్ష్యం

8 Oct, 2016 23:39 IST|Sakshi
సత్వర న్యాయమే లోక్‌అదాలత్‌ లక్ష్యం
 జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి
కర్నూలు(లీగల్‌) :  కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే లోక్‌ అదాలత్‌ లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి  జి.అనుపమ చక్రవర్తి పేర్కొన్నారు. శనివారం ఉదయం 10:30 గంటలకు న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఆమె  ప్రారంభించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ కక్షిదారులు చిన్నచిన్న కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగకుండా లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఎస్‌.ప్రేమావతి, లోక్‌ అదాలత్‌ కార్యదర్శి ఎం.ఎ.సోమశేఖర్, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి సి.కె.గాయత్రిదేవి, జూనియర్‌ సివిల్‌ జడ్జిలు టి.రామచంద్రుడు, కె.స్వప్నరాణి, ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్స్‌లు ఎం.బాబు, పి.రాజు, సీనియర్‌ న్యాయవాదులు, కక్షిదారులు ఇన్సురెన్స్‌ కంపెనీల అధికారులు పాల్గొన్నారు. 
 
జిల్లాలో 1,230 కేసులు పరిష్కారం... 
జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో 1,230 కేసులు పరిష్కారం చేశారు. కర్నూలులో 298, నంద్యాల 196, ఆదోనిలో 85, నందికొట్కూరులో 54, ఆత్మకూరులో 217, ఎమ్మిగనూరులో 34, ఆలూరులో 35, డోన్‌లో 78, ఆళ్లగడ్డలో 58, పత్తికొండలో 28, కోవెలకుంట్లలో 91, బనగానపల్లెలో 56 కేసులు పరిష్కారం అయినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధికారులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు