మత్య్సకారుడి కుటుంబానికి బీమా చెక్కు

13 Aug, 2016 00:35 IST|Sakshi
పోచమ్మమైదాన్‌ :   చెరువులో పడి మరణించిన ముగ్గురు మత్స్యకారుల కు టుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను శుక్రవారం అందజేశారు. పాలకుర్తికి చెందిన పిట్టల సత్తయ్య, మొగుళ్లపెల్లికి చెందిన పంజ చంద్రయ్య, పరకాలకు చెందిన వీర్ల పాణి ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్‌ మహాసభ అధ్యక్షుడు డాక్టర్‌ బండా ప్రకాష్, మత్స్యశాఖ సహాయ సంచాలకులు సతీష్, బుస్సా మల్లేశం పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు