అంతర్‌ జిల్లాల కబడ్డీ పోటీలు ప్రారంభం

18 Oct, 2016 01:29 IST|Sakshi
అంతర్‌ జిల్లాల కబడ్డీ పోటీలు ప్రారంభం
ఆచంట : స్థానిక ఎంవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో  సోమవారం సాయంత్రం అంతర్‌ జిల్లాల అండర్‌–19 కబడ్డీ పోటీలు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం క్రీడాకారులను పరి చయం చేసుకున్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు చెందిన బాలుర, బాలికల జట్లు పోటీలకు తరలివచ్చారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.  
ఒలింపిక్స్‌లో కబడ్డీని చేర్చాలి
రాష్ట్రంలోనూ, దేశంలోనూ కబడ్డీకి విశేష ఆదరణ ఉందని ఒలింపిక్స్‌లో చేరిస్తే భారత జట్టు తప్పక బంగారు పతకం సాధిస్తుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. కబడ్డీ పోటీలను ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడలను మరింత  ప్రోత్సహిస్తుందని, బడ్జెట్‌లో మరిన్ని నిధులు కేటాయించేలా కృషి చేస్తానని చెప్పారు. చదువుతో పాటు క్రీడలూ ప్రధానమని, తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. కళాశాలలో ప్రహరీ నిర్మాణానికి, మైదానం చదును చేసేందుకు నిధులు కేటాయిస్తామని చెప్పారు. స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర పరిశీలకులు కేవీ శేషగిరిరావు, బి.రామారావు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వేణుగోపాలరెడ్డి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ సభ్యుడు ఆదిరెడ్డి సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఐజాక్, కళాశాల ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాసరావు, సర్పంచ్‌ బీరా తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఆయా జిల్లాల కోచ్‌లు, పీడీలు పోటీలను పర్యవేక్షించారు. 
 
మరిన్ని వార్తలు