అంతర్‌ జిల్లా ఆటో దొంగల ముఠా అరెస్ట్‌

23 Sep, 2016 23:40 IST|Sakshi
వివరాలు తెలుపుతున్న సీఐ ఎంఎ.షుకూర్‌
  • నాలుగు ఆటోలు స్వాధీనం
  • పాల్వం^è  : ఖమ్మం, వరంగల్‌ జిల్లాలో వరుస ఆటోల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పాల్వంచ పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం పీఎస్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎంఎ షుకూర్‌ వివరాలను వెల్లడించారు. శుక్రవారం ఎస్‌ఐలు పి.సత్యనారాయణరెడ్డి, టి. కృష్ణయ్యలు విశ్వసనీయ  సమాచారం మేరకు అల్లూరి సెంటర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా కొత్తగూడెంకి చెందిన ఎండీ అన్వర్‌ఖా¯ŒS, కల్లూరు అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మేకల నరేష్, పాల్వంచ ఇందిరా కాలనీకి చెందిన పిట్టా క్రాంతికుమార్, సంజయ్‌నగర్‌కు చెందిన పూల హేమంత్, కరకవాగుకు చెందిన వజ్జా  అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నిజాలు బయటపడ్డాయి. పాల్వంచ, కల్లూరు, ఖమ్మం, వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో వరుసగా నాలుగు ఆటోలను చోరీ చేసింది ఈ ముఠానే అని తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి ఆటోలను రికవరీ చేశామని, వాటి విలువ సుమారు రూ. 4 లక్షలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐలు సత్యనారాయణ, కృష్ణయ్య, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

     

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు