ఇంటర్‌ స్కూల్‌ గేమ్స్‌ ప్రారంభం

20 Sep, 2016 20:31 IST|Sakshi
ఇంటర్‌ స్కూల్‌ గేమ్స్‌ ప్రారంభం
నల్లగొండ టూటౌన్‌: ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ. సింధు, సాక్షి మాలిక్‌ను క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎల్‌పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. తెలంగాణ రికగ్నైజ్‌డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఇంటర్‌ స్కూల్‌ గేమ్స్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న భారత్, క్రీడల్లో మాత్రం చివరి స్థానంలో ఉంటుందన్నారు. దీనిని అధిగమించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించి పేరు ప్రతిష్టలు తీసుకరావాలన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చొరవ తీసుకుని క్రీడాపోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆర్డీఓ వెంకటాచారి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొడ్డుపల్లి లక్ష్మీశ్రీనివాస్‌లు మాట్లాడారు. అంతకు ముందు విద్యార్థులు మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ పోటీలకు పట్టణంలోని 40 ప్రైవేట్‌ పాఠశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంవీఆర్‌ విద్యాసంస్థల చైర్మన్‌ కొలనుపాక రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీఈఓ వై.చంద్రమోహన్, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, డీఎస్‌డీఓ మక్బూల్‌ అహ్మద్, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి పుల్లయ్య, ట్రస్మా నాయకులు ముక్కాముల రామ్మోహన్, వైద్యం వెంకటేశ్వర్లు, ఎన్‌ఎల్‌.నర్సింహారావు, బాలశౌరెడ్డి, ట్రస్మా పట్టణ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి, కార్యదర్శి సీహెచ్‌. యాదయ్య, కోశాధికారి సురేష్, గౌరవ అధ్యక్షుడు జి.సత్యనారాయణరెడ్డి, రమేష్‌రెడ్డి, బిజు జోసెఫ్, యాదగిరిరావు, కేశవులు, ఫయాజ్, రాజు, జాన్‌రెడ్డి, శ్రీనివాసు, రాజేశ్వర్‌రావు, నాగేందర్‌ పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు