అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా అరెస్ట్‌

11 Dec, 2016 01:33 IST|Sakshi
అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠా అరెస్ట్‌
పెనుగొండ : పెనుగొండ సర్కిల్‌ పరిధిలోని రాపాక బ్రిడ్జి వద్ద నిర్వహిస్తున్న వాహన తనిఖీల్లో రాష్ట్రవ్యాప్తంగా 29 కేసులతో సంబంధం ఉన్న అంతర్రాష్ట్ర నేరస్తుల ముఠాకు చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి కారు, బంగారు ఆభరణాలు, రెండు మోటారుసైకిళ్లు, నాలుగు ఎల్‌సీడీ టీవీలు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, పెనుగొండ సీఐ సీహెచ్‌ రామారావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం రాపాక వద్ద ఇరగవరం ఎస్సై జీజే ప్రసాద్‌తో కలిసి సీఐ సీహెచ్‌ రామారావు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఏపీ 37 బీఎల్‌ 7799 కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని పాత నేరస్తులు పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రకు చెందిన జక్కంశెట్టి నాగరాజు (27), కృష్ణాజిల్లా నూజివీడుకు చెందిన గుత్తికొండ పవ¯ŒSకుమార్‌ (30), హైదరాబాదు ఎల్‌బీ నగర్‌కు చెందిన ఆవుల కిరణ్‌కుమార్‌ (27)గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో 400 గ్రాముల బంగారు ఆభరణాలు, నాలుగు టీవీలు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో విచారించడంతో నేరాలు బయటపడ్డాయి. జిల్లాలోని ఇరగవరంలో మూడు, పెనుమంట్రలో మూడు చోరీలు, తణుకులో ఓ చోరీ, తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి అర్బ¯ŒS పరిధిలో 10 చోరీలు, ఇతర పోలీసుస్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు, విశాఖ జిల్లాలో 7 చోరీలు, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ చోరీకి పాల్పడినట్టు గుర్తించారు. వీరు చోరీ చేసిన బంగారు ఆభరణాలు అమ్మి రేనాల్ట్‌ కారును కొని మండపేట కేంద్రంగా ఇతర జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. మొత్తంగా 1,160 గ్రాముల బంగారు ఆభరణాలు వీరు చోరీ చేసినట్టు గుర్తించారు. వీటిలో పెనుగొండ సర్కిల్‌ పరిధిలో 400 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి.
 
జైలులో ముఠాగా మారి..
ఎవరికి వారు దొంగతనాలు చేసుకొని జీవించే వీరికి జైలు జీవితం నలుగురిని కలిపి ముఠాగా చేసింది. గుత్తికొండ పవ¯Œకుమార్, జక్కంశెట్టి నాగరాజు జైలు నుంచి బయటకు వచ్చి పసుపులేటి కిరణ్‌కుమార్‌ను బెయిల్‌పై బయటకు తీసుకువచ్చారు. అదేవిధంగా ఏలూరులో జైలులో ఉన్న ఆవుల కిరణ్‌కుమార్‌ను బెయిల్‌పై తీసుకువచ్చి తూర్పుగోదావరి జిల్లా మండపేట నుంచి కార్యకలాపాలు నిర్వహించడం ప్రారంభించారు. నలుగురు కలవడంతో చోరీలు యథేచ్ఛగా సాగాయి. అయితే, వాటల వద్ద విభేదాలు రావడంతో పసుపులేటి కిరణ్‌కుమార్‌ విడిపోయి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు పసుపులేటి కిరణ్‌కుమార్‌ కోసం వేట ప్రారంభించారు. కిరణ్‌కుమార్‌ చిక్కితే మరింత బంగారం బయట పడవచ్చని అంచనా వేస్తున్నారు. పలు పోలీస్‌స్టేçÙన్లలో వీరిపై నా¯ŒSబెయిల్‌బుల్‌ వారెంట్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. పెనుగొండ సర్కిల్‌ పరిధిలోని పెనుమంట్ర, ఇరగవరం కేసులకు సంబంధించి అరెస్ట్‌ చేసి ముగ్గురు నేరస్తులు జక్కంశెట్టి నాగరాజు, గుత్తికొండ పవ¯ŒSకుమార్, ఆవుల కిరణ్‌కుమార్‌ను కోర్టుకు హజరు పరుస్తున్నట్టు డీఎస్పీ పూర్ణచంద్రరావు తెలిపారు. చోరీ కేసుల ఛేదించడంలో ఎస్సై జీజే ప్రసాద్, కానిస్టేబుల్‌ వెంకట్రావును అభినందిస్తూ రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్టు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు