-

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

24 Jun, 2016 01:00 IST|Sakshi

సెంకడియర్‌లో స్టేట్ ఫస్ట్..                     
ప్రథమ సంవత్సరంలో 6వ స్థానం
ఈ నెల 30 వరకు రీకౌంటింగ్ గడువు
సర్కార్ కళాశాలల పరంగా రాష్ట్రంలో ప్రథమం

 
 
ఆదిలాబాద్ టౌన్ : ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ ఆచార్య గురువారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 61 శాతం ఉత్తీర్ణత సాధించి జిల్లాను రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు. ప్రథమ సంవత్సరంలోనూ 61 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్ర స్థాయిలో జిల్లాకు 6వ స్థానం దక్కింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఒకేషనల్ ఫలితాల పరంగా జిల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ముందు వరుసలో నిలిచారు. ఈ ఫలితాల్లోనూ బాలికలు బాలుర కంటే పై చేయి సాధించారు.


 ప్రథమ సంవత్సరంలో..
ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరంలో  13,632 మంది విద్యార్థులు హాజరు కాగా 8,323 మంది ఉత్తీర్ణత సాధించారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 6,781 మంది పరీక్షకు హాజరు కాగా 3,796 మంది ఉత్తీర్ణత సాధించారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 6,851 మంది పరీక్షకు హాజరుకాగా 4,527 ఉత్తీర్ణత సాధించారు. 66 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రభుత్వ కళాశాలల పరంగా.. 2108 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1097 మంది ఉత్తీర్ణులయ్యారు. 52 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 1,122 మంది  విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 546 మంది పాసయ్యారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 986 మంది పరీక్ష రాయగా 551 మంది పాసయ్యారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రైవేటు కళాశాలల పరంగా.. మొత్తం 7,332 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 3,278 మంది ఉత్తీర్ణత సాధించారు. 45 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 3,858 మంది పరీక్షకు హాజరు కాగా 1,576 మంది ఉత్తీర్ణత సాధించారు. 41 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3,474 మంది పరీక్షకు హాజరు కాగా 1,702 ఉత్తీర్ణత సాధించారు. 49 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

వోకేషనల్ కోర్సులో మొత్తం 881 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 496 మంది ఉత్తీర్ణులయ్యారు. 56 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 590 మంది పరీక్షకు హాజరు కాగా 320 మంది పాసయ్యారు. 54 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు  291 మంది పరీక్షకు హాజరు కాగా 176 మంది పాసయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, వోకేషనల్ కోర్సుల ఫలితాల పరంగా జిల్లా విద్యార్థులు  స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు.

 ద్వితీయ సంవత్సరం ఫలితాలు..
ద్వితీయ సంవత్సరం పరీక్షలకు మొత్తం 7,716 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 4,693 మంది ఉత్తీర్ణులయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 4,448 మంది పరీక్షకు హాజరు కాగా 2,663 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 3,268 మంది పరీక్ష రాయగా 2,030 మంది పాసయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రభుత్వ కళాశాలల పరంగా..మొత్తం 968 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 661 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 577 మంది పరీక్షకు హాజరు కాగా 388 మంది పాసయ్యారు. 67 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 391 మంది పరీక్ష రాయగా 273 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 70 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ప్రైవేటు కళాశాలల ఫలితాలలో.. మొత్తం 6,505 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా వారిలో 3,906 మంది ఉత్తీర్ణులయ్యారు. 60 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 3,749 మంది పరీక్ష రాయగా, 2,221 పాసయ్యారు. 59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,756 మంది పరీక్ష రాయగా 1,685 పాసయ్యారు. 61 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

 వోకేషనలో కోర్సులో మొత్తం 622 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 387 మంది ఉత్తీర్ణత సాధించారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 421 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 259 మంది ఉత్తీర్ణులయ్యారు. 62 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 201 మంది పరీక్ష రాయగా వారిలో 128 మంది ఉత్తీర్ణతసాధించారు. 64 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
 
 
 30 వరకు రీ కౌంటింగ్ గడువు
రీ- కౌటింగ్, రీ- వెరిఫికేషన్ కోసం ఈ నెల 30 వరకు విద్యార్థులు అన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఆర్‌ఐవో నాగేందర్ తెలిపారు. రీ- కౌటింగ్ కోసం సబెక్టుకు రూ. 100, రీ- వెరిఫికేషన్ కోసం సబెక్టుకు రూ. 600లు చెల్లించాల్సి ఉంటుదన్నారు. మెమోలో విద్యార్థుల పేర్లు, ఏవైనా తప్పులు దొర్లినట్లరుుతే జూలై 20 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్‌ఐవో తెలిపారు.

మరిన్ని వార్తలు