ఆసక్తికరంగా కోఆప్షన్‌ ఎన్నిక

29 Sep, 2016 23:33 IST|Sakshi
ఆసక్తికరంగా కోఆప్షన్‌ ఎన్నిక
  • నామినేషన్‌ వేసేందుకు చివరి నిమిషంలో తిరస్కరించిన మృతుడి భార్య
  • వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి ఏలీయా ఏకగ్రీవం
  • కె.గంగవరం : 
    మండల పరిషత్‌ కో ఆప్షన్‌ ఎన్నిక గురువారం ఆసక్తికరంగా జరిగింది. కో ఆప్షన్‌ సభ్యుడైన సురేష్‌ అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో గురువారం జిల్లా అధికారుల ఉత్తర్వుల మేరకు కో ఆప్షన్‌ సభ్యుడి ఎన్నిక నిర్వహించారు. మండల పరిషత్‌లో 18 మంది ఎంపీటీ సభ్యులకు 10 మంది  వైఎస్సార్‌ సీపీ వారే ఉన్నారు. సురేష్‌ భార్యను కోఆప్షన్‌ సభ్యురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రధానపార్టీలైన వైఎస్సార్‌ సీపీ, టీడీపీ లు భావించాయి. అయితే చివరి నిమిషంలో నామినేషన్‌ వేసేందు కు ఆమె నిరాకరించింది. ఆ పరిస్థితుల్లో  ఎంపీపీ శ్రీనివాస్‌ చొరవ తీసుకుని ఉదయం 10 గంటలకు పామర్రు గ్రామానికి చెందిన పాస్టర్స్‌ ఫెలోషిప్‌ మండల గౌరవ అధ్యక్షుడు డి. ఏలీయాతో చివరి నిమిషంలో నామినేషన్‌ ఎన్నికల అధికారి కె. కుమార్‌ అందించారు. టీడీపీ నామినేషన్‌ దాఖల చేయకపోవడంతో ఏలియా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు.  ఈ ఎన్నికకు ప్రత్యేకాధికారిగా ఉన్న కె. కుమార్‌ ధ్రువీకరణ పత్రాన్ని కోఆప్షన్‌ సభ్యుడు ఏలియాకు అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం కో ఆప్షన్‌ సభ్యుడిని పూలదండలతోS అభినందించారు. జెడ్పీటీసీ సభ్యుడు మేడిశెట్టి రవికుమార్, ఆత్మ చైర్మన్‌ అల్లూరి దొరబాబు, ఎంపీడీఓ సీహెచ్‌ నరసారావు, తహసీల్దార్‌ ప్రకాష్‌బాబు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
     
    వైఎస్సార్‌ సీపీ సభ్యుడిగా ఏలియా
    మండల పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడిగాఎన్నికైన ఏలియాకు వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు, ఎంపీపీ పెట్టా శ్రీనివా స్‌ పార్టీ కండువా వేసి పార్టీ సభ్యుడిగా ప్రకటించారు. మండల ఎస్సీ సెల్‌ కన్వీనర్‌ బత్తుల అప్పారావు, బీసీ నాయకులు సుబ్బారావు, సర్పంచ్‌లు  గోవిందరాజు, సాయి, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 
     
>
మరిన్ని వార్తలు