‘ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుతో విచారణ జరిపించాలి’

27 Aug, 2016 22:41 IST|Sakshi

కొల్లాపూర్‌: వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుచే విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోళ్లశివ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆకుతోట వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు, సీఐడీచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

బాధిత కుటుంబానికి రూ. 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దుండగులను నిర్భయ చట్టం ద్వారా శిక్షించాలని అన్నారు. ఈ కేసులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనకు సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో దండోరా తాలూకా ఇన్‌చార్జి లక్ష్మయ్య, జిల్లా నాయకులు వడ్డెమాన్‌ రాముడు, సన్నయ్య, కుర్మయ్య, ఎంఎస్‌ఎఫ్‌ తాలూకా ఇన్‌చార్జ్‌ తోలు రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు