కొనసాగుతున్న ఏసీబీ దర్యాప్తు

29 Jul, 2016 17:49 IST|Sakshi

లంచం తీసుకుంటూ గురువారం పట్టుబడిన ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ ప్రసన్నకుమార్‌ను ఏసీబీ అధికారులు శుక్రవారం కూడా విచారించారు. లంచం కేసులో మధ్యవర్తిగా వ్యవహరించిన రఫీతోపాటు ఆయన బస చేసిన లక్డీకాపూల్‌లోని వెంకటేశ్వర లాడ్జిపైనా దాడులు చేశారు. ఆయన ఉంటున్న 201 నంబర్ రూంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రూ.36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. రఫీతోపాటు ప్రసన్నకుమార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ రమాదేవి తెలిపారు.

 

మరిన్ని వార్తలు