సత్వరమే అనుమతులు

20 Aug, 2016 01:34 IST|Sakshi
సత్వరమే అనుమతులు

పెట్టుబడిదారుల సదస్సులో సీఎం
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా విశాఖలో నిర్మించనున్న ఏపీ మెడ్‌టెక్ జోన్‌లో యూనిట్ల స్థాపనకు ముందుకు రావాలని పెట్టుబడిదార్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే అన్ని వసతులు కల్పిస్తామని, సత్వరమే (14 రోజుల్లో) ఆన్‌లైన్‌లో అనుమతులు ఇస్తామని చెప్పారు. శుక్రవారం విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల్లో రూ. 225 కోట్ల వ్యయంతో ఏర్పాటు కానున్న మెడ్‌టెక్ జోన్‌కు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అనంతకుమార్‌లతో కలిసి చంద్రబాబు భూమి పూజ చేశారు. అనంతరం ఉక్కునగరం క్లబ్‌లో జరిగిన ఇన్వెస్టర్ల మీట్‌లో ఆయన మాట్లాడారు. మెడ్‌టెక్ జోన్‌ను ప్రతిపాదించిన ఎనిమిది నెలల్లోనే డీపీఆర్, ఎస్‌పీవీ, భూ కేటాయింపు పూర్తయిందన్నారు. మరో ఏడాదిలో ఈ జోన్ కార్యరూపం దాలుస్తుందన్నారు.

>
మరిన్ని వార్తలు