ఐఆర్‌సీటీసీ అదిరిపోయే విమాన ప్యాకేజీలు

24 Aug, 2016 04:53 IST|Sakshi
ఐఆర్‌సీటీసీ అదిరిపోయే విమాన ప్యాకేజీలు

కాజీపేట రూరల్‌ : దసరా పండుగను పురస్కరించుకుని పర్యాటకుల కోసం ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రత్యేక విమాన ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు ఆ శాఖ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సంజీవయ్య, ఎగ్జిక్యూటీవ్‌ పవన్‌కుమార్‌ సెంగర్‌ తెలిపారు. కాజీపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్యాకేజీల వివరాలు వెల్లడించారు.

 
2005లో ప్రారంభమైన ఐఆర్‌సీటీసీ మొదట రైల్‌ ప్యాకేజీలను ప్రారంభించిందని, తర్వాత రైల్‌ కోచ్‌ల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం విమాన ప్యాకేజీలను ప్రవేశపెట్టిందన్నారు. విమాన ప్యాకేజీ యాత్రలో పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ భోజనం, వసతి, బస్సులు తదితర సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. 
 
హైదరాబాద్‌– హాంకాంగ్‌..
హైదరాబాద్‌ టు çహాంకాంగ్‌ అంతర్జాతీయ విమాన యాత్ర అక్టోబర్‌ 8న హైదరాబాద్‌ రాజీవ్‌గాంధీ విమానశ్రయం నుంచి ప్రారంభమవుతుందన్నారు. తిరిగి 12వ తేదీన హాంకాంగ్‌లో బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుందన్నారు. నాలుగు రాత్రులు, 5 రోజులపాటు ఉండేlటూర్‌లో ఒక్కోక్కరికి రూ.73,419 టికెట్‌ ధర ఉందన్నారు. ఈ యాత్రలో హంకాంగ్, మకావ్, షెంజెన్‌ సిటీ లను చూపిస్తారన్నారు. మేడం టుస్సాడ్స్, మైనపు విగ్రహాలు ప్రదేశం, 100 అంతస్తుల హంకాంగ్‌ ఎల్తైన భవనం, లెడ్‌ అండ్‌ సౌండ్‌ షో, హంకాంగ్‌ డిస్నిల్యాంyŠ  కూడా చూడవచ్చని వివరించారు.
 
హైదరాబాద్‌–దుబాయి
ఈ విమాన యాత్ర హైదరాబాద్‌లో అక్టోబర్‌ 10న ప్రారంభమై దుబాయికి వెళ్తుందన్నారు. తిరిగి అక్టోబర్‌ 14న హైదరాబా ద్‌కు వస్తుందన్నారు. 4 రాత్రులు, 5 రోజులపాటు ఉండే టూర్‌ టికెట్‌ ధర ఒక్కోక్కరికి రూ.63,586 ఉందన్నారు. ఈ యాత్రలో దుబాయ్‌ అముదాబి సిటీలు, బూర్జుఖలీఫా, మిరాకిల్‌ గార్డెన్, డెసర్‌ సఫారీ తదితర ప్రదేశాలను చూపిస్తారన్నారు.
 
హైదరాబాద్‌–గోవా
హైదరాబాద్‌–గోవా విమాన యాత్ర అక్టోబర్‌ 21న హైదరాబాద్‌లో బయలుదేరి వెళ్తుందన్నారు. తిరిగి గోవా నుంచి 24వతీ దీన హైదరాబాద్‌కు వస్తుందన్నారు. ఈ ప్యాకేజీలో మూడు రాత్రులు,  నాలుగు రోజులు ఉంటాయన్నారు. ఇందులో ఒక్కోక్కరికి రూ.18,970 టికెట్‌ ధర ఉందన్నారు. సౌత్‌ గోవా, నార్త్‌ గోవా, బీచ్‌లు, చర్చీలు, ఆలయాలు, సముద్రాలపై స్టీమర్‌తో విహార యాత్ర ఉంటుందన్నారు.
 
హైదరాబాద్‌–తిరుపతి
హైదరాబాద్‌లో నవంబర్‌ 4న విమానయాత్ర బయలుదేరి తిరుపతికి వెళ్తుందన్నారు. తిరిగి తిరుపతిలో 5వ తేదీన బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుందన్నారు. అలాగే హైదరాబాద్‌లో 18న బయలుదేరి తిరుపతికి వెళ్తుందన్నారు. 19వ తేదీన తిరుపతి నుం చి బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుందన్నారు. ఈ యాత్రలో తిరుమల తిరుపతి దర్శనం, శ్రీకాళహస్తి, కానిపాకం తదితర ప్రదే శాలు చూపిస్తారన్నారు. ఈ ప్యాకేజీలో ఒక్కోక్కరికి టిక్కెట్‌ ధర రూ.9775 ఉంటుందన్నారు.
 
పర్యాటకులు ఐఆర్‌సీటీసీ వివరాల ప్యాకేజీల కోసం 040–27702407, 97013–60647, 97013–60609, 97013 – 60605 నంబర్లలో సంప్రదించాలని కోరారు.  

మరిన్ని వార్తలు