కోతుల కట్టడి ఇలాగా.. ?

22 Sep, 2016 20:58 IST|Sakshi
కోతుల కట్టడి ఇలాగా.. ?
తెనాలి: జంతు సంరక్షణ చట్టాల్లో కాలానుగుణంగా మార్పులు తెస్తూ తగిన ప్రచారం చేస్తున్నా అమలు చేయాల్సిన ప్రభుత్వ శాఖలకు మాత్రం అవి  చెవికెక్కటం లేదు. జంతువులను ప్రేమగా చూడాలని, హింసించవద్దనీ దేశవ్యాప్తంగా జంతు ప్రేమికులు పోరాడుతున్నారు. మూడు చిన్న బోనుల్లో గురువారం తెనాలి పట్టణానికి చెందిన మున్సిపాలిటీ సిబ్బంది 96 కోతుల్ని ఇలా కిక్కిరిసేలా ఉంచారు. పట్టణంలోని వివిధ ప్రదేశాల్లో సంచరిస్తున్న కోతులను అదుపులోకి తీసుకొని ఇలా చాలీచాలని బోనుల్లో బంధించారు. ఆ మూగజీవుల బాధను కళ్లారా చూసి చలించిన ఓ పౌరుడు తన స్మార్ట్‌ఫోనులో ఫొటో తీసి మీడియాకు పంపించారు. ఈ విషయం తర్వాత మున్సిపాలిటీ వారికి తెలిసిందో ఏమో? సాయంత్రానికల్లా టాటా ఏస్‌ వాహనం తీసుకొచ్చి కోతులను చిలకలూరిపేట వద్ద కొండల్లో వదిలేందుకు సిద్ధమయ్యారు.
మరిన్ని వార్తలు