ఇస్రో.. విజయీభవ..

1 Feb, 2017 22:13 IST|Sakshi
ఇస్రో.. విజయీభవ..
రికార్డు స్థాయిలో 103 ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి ప్రవేశపెట్టి అంతర్జాతీయంగా ఉన్నతంగా నిలిచేందుకు ఈనెల 17న సన్నద్ధమవుతున్న ఇస్రో ప్రయత్నం విజయవంతం కావాలంటూ బుధవారం రావులపాలెంలో విద్యార్థులు వినూత్నంగా ప్రదర్శన నిర్వహించారు. స్థానిక లిటిల్‌ఫ్లవర్‌ స్కూల్‌ విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో పీఎస్‌ఎల్‌వీ సీ–37, 103 సంఖ్యల ఆకృతిలో కూర్చొని ఇస్రో విజయీభవా అంటూ జేజేలు పలికారు. స్కూల్‌ డైరెక్టర్‌ పీవీఎస్‌ సూర్యకుమార్‌ మాట్లాడుతూ శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందుండి ఒకేసారి 20 కృత్రిమ ఉపగ్రహాలను కక్షలోకి పంపి రష్యా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన నిల్చున్న భారతదేశ ఇస్రో సంస్థ తాజా 103 ఉప గ్రహాలను కక్ష్యలోకి సంధించే కార్యక్రమాన్ని చేపట్టడం భారతీయులు అందరు గర్వించదగిన విషయమన్నారు.
- రావులపాలెం(కొత్తపేట) 
 
మరిన్ని వార్తలు