లబ్ధిదారులకు బాండ్ల పంపిణీ

2 Aug, 2016 23:18 IST|Sakshi

మునగాల: 2005–2011 సంవత్సరాల మధ్యలో బాలికా శిశు సంక్షేమ అభివృద్ధి  పథకానికి దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో కోదాడ ఐసీడీయస్‌ సీడీపీఓ కృష్ణకుమారి చేతుల మీదుగా బాండ్లను పంపీణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో ఇద్దరు ఆడపిల్లలు కన్న తల్లులతో పాటు ఒక ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆపరేషన్‌ చేయించుకున్న మహిళలు 150 మంది లబ్ధిదారులకు, బంగారుతల్లి పథకం లబ్ధిదారులకు  బాండ్లను పంపీణీ చేస్తున్నట్లు తెలిపారు.  ఇద్దరు ఆడపిల్లల ఉన్న తల్లిదండ్రులకు రూ.60వేలు, ఒక ఆడపిల్లకు జన్మనిచ్చిన తల్లికి రూ.లక్ష చొప్పున బాండ్లను పంపీణీ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ బాండ్లు బాలికకు 20ఏళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే మార్చుకోవాల్సి ఉంటుందన్నారు.  ఈ లోగా బాండ్లు పొందిన పిల్లలు మధ్యలో చదువు మానేసిన, వివాహాం చేసుకున్న ఈ బాండ్లు వర్తించవని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ భీమపంగు అక్కమ్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు  సంధ్య, మణి, మణెమ్మ, కమల, రూప తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు