భవితకు భరోసా శూన్యం

14 Feb, 2017 23:00 IST|Sakshi
భవితకు భరోసా శూన్యం
  • ఏడాది తరువాత సాదాసీదాగా..
  • తీరు మారని ఐటీడీఏ పాలకవర్గం సమావేశం
  • రంపచోడవరం : 
    ఏడాది తరువాత నిర్వహించిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం యథాలాపంగా జరిగింది. గిరిజనులకు భరోసా ఇచ్చే ఒక్క చర్యా తీసుకోలేదు. పోలవరం నిర్వాసితులు, అటవీ హక్కుల చట్టం అమలు తీరుతో పాటు జీసీసీ వంటి శాఖల అంశాలను విస్మరించారు. ప్రతి త్రైమాసికానికీ నిర్వహించాల్సిన పాలకవర్గ సమావేశం ఏడాది తరువాత నిర్వహించడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ చైర్మన్, కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ అధ్యక్షతన మంగళవారం ఈ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీలు టి రత్నబాయి, రెడ్డి సుబ్రమణ్యం, ఎంపీలు తోట నరసింహం, కొత్తపల్లి గీత, జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు పాల్గొన్నారు.
     
     
    సమావేశాల రద్దు మీ ఇష్టమేనా?
    ఐటీడీఏ పాలకవర్గ సమావేశానికి తేదీ ప్రకటించి అధికారులు ఇష్టమెచ్చినట్లు రద్దు చేయడంపై ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రమణ్యం, ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అధికారులను నిలదీశారు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టరాజ్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఐటీడీఏ అధికారుల తీరును రెడ్డి సుబ్రమణ్యం తప్పు పడుతూ ఏడాదిగా సమావేశం నిర్వహించకపోవడానికి కారణం చెప్పాలన్నారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. ఎంపీ గీత గో ఎహేడ్‌ అంటూ మాట్లాడంపై ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అసహనం వ్యక్తం చేయడంతో ఇరువురి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది.
     
    హోలీ ఏంజెల్స్‌ డైరెక్టర్‌ను అరెస్టు చేయలేదా?
    గిరిజన విద్యార్థినులను చిత్రహింసలకు గురిచేసిన హోలీఏంజెల్స్‌ పాఠశాల డైరెక్టర్‌ మధుసూదనరావును ఇంకా అరెస్టు చేయకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతనిపై క్రిమినల్‌ కేసులు నమోదు  చేశామని, పరారీలో ఉన్నాడని కలెక్టర్‌ చెప్పగా, పోలీసులు తలుచుకుంటే అరెస్టు చేయడం ఎంతసేపని ఆమె ప్రశ్నించారు. బొమ్మూరు ఆశ్రమ పాఠశాల బాలికలను ౖలైంగికంగా వేధించిన ఏటీడబ్ల్యూఓపై కేసులు ఎందుకు పెట్టలేదన్నారు. విచారణ జరుగుతోందన్న పీఓ వివరణపై ఆమె  అసంతృప్తి వ్యక్తం చేశారు. నెలకు ఒక్కసారి కూడా పాఠశాల విద్యార్థుల ప్రగతిని ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. ఎమ్మెల్సీ టి.రత్నబాయి మాట్లాడుతూ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని, ఆశ్రమ పాఠశాలల్లో మెనూ సక్రమంగా అమలు చేయాలని అన్నారు.
     
    పోషకాహార లోపంతోనే మతా, శిశు మరణాలు
    ఏజెన్సీలో పోషకాహార లోపంతోనే మతాశిశు మరణాలు సంభవిస్తున్నాయని, వాటి నివారణకు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అన్నారు. ఐసీడీఎస్‌ ద్వారా అదనంగా పోషకాహారం అందడం లేదన్నారు. వెలుగు ద్వారా నిర్వహించే పౌష్టికాహార కేంద్రాలను మూసివేశారన్నారు. వైద్యాధికారుల పోస్టులను భర్తీ చేయాలని, అంబులె¯Œ్సలు అందుబాటులో ఉంచాలని జెడ్పీటీసీలు, ఎంపీపీలు డిమాండ్‌ చేశారు.
     
    ఇంజనీరింగ్‌ ప్రగతి కాగితాలకే పరిమితం
    గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం ప్రగతి కాగితాలకే పరిమితమైనట్టుందని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా మంజూరు చేసిన పనులు నేటికీ ప్రారంభించలేదని ధ్వజమెత్తారు.  రంపచోడవరం మండలంలో రహదారులకు ప్రతిపాదనలు పెట్టడం లేదని ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి అనడంతో గిరిజన సంక్షేమ ఇంజనీర్‌కు ఆయనకూ వాగ్వాదం జరగ్గా, ఈఈ పీకే నాగేశ్వరరావు రోడ్డు నిర్మాణం కోసం పెట్టిన ప్రతిపాదనలు చదివినిపించారు. సమావేశంలో ఐటీడీఏ పీవో ఏఎస్‌ దినేష్‌కుమార్, ఏఎస్పీ అద్నా¯ŒS నయీం ఆస్మీలు పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు