గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలి

9 Sep, 2016 00:08 IST|Sakshi

అనంతపురం అర్బన్‌ : గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 11న అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని తెలిపారు.

ఈ ప్రతిపాదనపై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంతో ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. ప్రత్యామ్నాయాన్ని సూచిం చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింద ని, ఈ క్రమంలో విజయవాడ కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించాలనే అంశం తెరపైకి వచ్చిందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం విజయవాడ, అమరావతి పరిసరాల్లోనే అభివృద్ధి కేంద్రీకృతం చేస్తుండటంతో రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో గుంతకల్లు కేంద్రంగా రైల్వే జోన్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.

సీపీఐ కౌన్సిల్‌ సమావేశం వాయిదా
ఈ నెల 10న జిల్లా బంద్‌ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించాల్సిన సీపీఐ జిల్లా కౌన్సిల్‌ విస్తృత స్థాయి సమావేశం వాయిదా వేసినట్లు జగదీశ్‌ తెలిపారు. సమావేశం నిర్వహించే తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు