ధైర్యం చెబుతూ... భరోసానిస్తూ...

1 Jul, 2017 00:13 IST|Sakshi
ధైర్యం చెబుతూ... భరోసానిస్తూ...
- చాపరాయి బాధితులకు జగన్‌ ఓదార్పు
- అధినేత రాకతో పార్టీ శ్రేణుల్లో సందడి
- తరలివచ్చిన వెస్సార్‌సీపీ నేతలు
కాకినాడ, కాకినాడ క్రైం:  అధైర్యపడవద్దని ధైర్యం చెబుతూ... త్వరలోనే కోలుకుంటారని భరోసానిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి చాపరాయి విషజ్వరాల బాధితులకు ఓదార్పునిచ్చారు. ఏజెన్సీలోని చాపరాయి విషజ్వరాలు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్‌ శుక్రవారం రాత్రి పరామర్శించారు. పీడియాట్రిక్‌ వార్డులో ఉన్న చిన్నారులు విజయ, కనకమ్మ, కె.స్వామిరెడ్డి, పల్లాల చిట్టెమ్మతో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆరా తీశారు. ప్రభుత్వాస్పత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న వైద్యులతో కూడా మాట్లాడి మెరుగైన సేవలు అందించాల్సిందిగా కోరారు. దాదాపు 30 నిమిషాలపాటు అక్కడ గడిపిన జగన్‌ నలుగురు బాధితులతోనూ మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితులతోపాటు చాపరాయి ప్రాంతంలో రేషన్‌ సరుకులు, మంచినీరు, వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునే విధంగా రోగులకు పౌష్టికాహారాన్ని, ఇతర సేవలను అందించాలని ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌ జీఎస్‌ఎన్‌మూర్తి, సీఎస్‌ఆర్‌ఎంవో శ్రీరామచంద్రమూర్తి, పీడియాట్రిక్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ మాణిక్యాంబ, వైద్యులు డాక్టర్‌ కృష్ణప్రసాద్, డాక్టర్‌ గిరిధర్‌లకు సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులను జగన్‌ స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి ధైర్యం చెప్పడంతో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో ఊరటనిచ్చినట్లయిది. 
జగన్‌కు ఘన స్వాగతం...
పశ్చిమగోదావరి జిల్లా నుంచి కాకినాడ ప్రభుత్వాస్పత్రికి చేరుకున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాజీ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, పాముల రాజేశ్వరిదేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, రాష్ట్ర, జిల్లా యువజన విభాగాల అధ్యక్షులు జక్కంపూడి రాజా, అనంత ఉదయ భాస్కర్‌తోపాటు వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల కన్వీనర్లు, రాష్ట్ర, జిల్లాకమిటీ నాయకులు ఘనస్వాగతం పలికారు. జగన్‌ వస్తున్న సమాచారం తెలియజేయడంతో పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలు కూడా పెద్ద ఎత్తున జీజీహెచ్‌కు తరలిరావడంతో ఆ ప్రాంతం సందడిగాను, పార్టీ శ్రేణుల నినాదాలతో  కోలాహలంగా మారింది. కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న నర్సులు తమ సమస్యలను జగన్‌కు విన్నవించగా రాజమహేంద్రవరం ప్రాంతంలో వైఎస్‌ హయాంలో ఇచ్చిన నివాసాలను జన్మభూమి కమిటీ సభ్యులు బలవంతంగా తొలగించి తమకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాలరాజు,  వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, ముత్తా శశిధర్, పర్వత ప్రసాద్, పితాని బాలకృష్ణ, రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, మిండకుదిటి మోహన్, సంగిశెట్టి అశోక్, ఎన్‌.ఎస్‌.రాజు, ముదునూరి మురళీకృష్ణంరాజు, రాష్ట్ర ప్రచారకమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, కాకినాడ నగర అధ్యక్షుడు ఆర్‌వీజేఆర్‌ కుమార్, రాష్ట్ర బీసీసెల్‌ క్యాదర్శి అల్లిరాజబాబు,  రాష్ట్ర యువజన విభాగం సభ్యులు వాసిరెడ్డిజమీలు, జిల్లా అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్‌ యనమదల మురళీకృష్ణ, జిన్నూరి వెంకటేశ్వరరావు, హరినా«ద్, ముమ్మిడివరం ప్లోర్‌లీడర్‌ కాశి మునికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు,  జిల్లా అధికార ప్రతినిధులు సబ్బెళ్ళ కృష్ణారెడ్డి,  కె.ఆదిత్యకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు