గిరిజనులకు దేవుడే దిక్కా?

8 Dec, 2016 23:31 IST|Sakshi
గిరిజనులకు దేవుడే దిక్కా?
మలేరియా మందులు అందుబాటులో లేవు
పేదల వైద్యం పట్టని ప్రభుత్వం
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
మారేడుమిల్లి : ఏజెన్సీలో మలేరియా తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మలేరియా మందులు లేకపోవడం చూస్తే ఈ ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని అర్ధమవుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రెండురోజుల ఏజెన్సీ పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి మారేడుమిల్లి వనవిహారిలో బస చేసిన జగన్‌ గురువారం ఉదయం స్థానిక పీహెచ్‌సీని సందర్శించి రోగులతో మాట్లాడి  సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బందితో మాట్లాడుతూ పూర్తిస్థాయిలో సిబ్బంది ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు. ముగ్గురు వైద్యా ధికారులకు ఒక్కరు మాత్రమే ఉన్నారని,  ఇద్దరు ల్యాబ్‌ టెక్నీషియన్లు అవసరం కాగా ఒకరే ఉన్నారని వారు తెలిపారు. పీహెచ్‌సీలోని సౌకర్యాలను పరిశీలించారు. రోగులకు వసతులు, మందులు అందుబాటులో ఉన్నాయా అని సిబ్బందిని    ప్రశ్నించగా మలేరియా మందులకు కొరత ఉందని  ఇండెంట్‌ పెట్టినా సెంట్రల్‌ డ్రగ్‌  స్టోర్‌ నుంచి సరఫరా కాలేదని తెలిపారు. మలేరియా తీవ్రంగా ఉన్న ప్రాంతంలో కూడా అత్యవసరమైన మందులు లేకపోవడంపై జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల ఆరోగ్యంపై చంద్రబాబుకు చిత్తశుద్ధిలేదన్నారు. సిబ్బందికి నాలుగు నెలల జీతాలు లేవని జగన్‌కు వివరించారు. జీతాలు లేకపోయినా క్షేత్రస్థాయిలో ఎలా సేవలు అందిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం పీహెచ్‌సీ ఆవరణలో నూతనంగా నిర్మాణం తలపెట్టి  మధ్యలో నిలిచిపోయి భవనాన్ని  పరిశీలించారు. రాష్ట్ర   వైద్య  ఆరోగ్య  శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మారేడుమిల్లి పీహెచ్‌సీని సందర్శించి ఏడాది గడుస్తున్నా భవన నిర్మాణంలో కదలిక లేకపోవడం వెనుక ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, జిల్లా యువజన విభాగం  అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్‌ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, మాజీ మంత్రులు  పినిపే విశ్వరూప్, పిల్లి సుభాష్‌చంద్రబోస్, నాయకులు కర్రి పాపారాయుడు, జిల్లా కార్యదర్శి గొర్లె బాలాజీబాబు, జెడ్పీటీసీ సభ్యుడు సత్తిసత్యనారాయణరెడ్డి,ఎంపీపీ కుండ్ల సీతామహలక్షి్మ, ఎంపీటీసీ సభ్యుడు అనిల్‌ప్రసాద్‌ పలువురు నాయకులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు