‘జై ఆంధ్రప్రదేశ్’కు జనం జై

2 Nov, 2016 08:39 IST|Sakshi
‘జై ఆంధ్రప్రదేశ్’కు జనం జై

విశాఖపట్నం : ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన వారే.. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తుండడంపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి, ప్రజలను నమ్మించి మోసం చేసిన పాలకులపై నిరసన జ్వాల రగులుతోంది. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు వెంట నడిచేందుకు ప్రజలు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో జనం గుండెచప్పుడు ఢిల్లీ పెద్దలకు వినిపించేలా ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘జై ఆంధ్రప్రదేశ్’ పేరిట ఈనెల 6న భారీ బహిరంగ సభకు విశాఖలో శ్రీకారం చుట్టారు. ఇందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నారుు. ఈ సభను విజయవంతం చేయడానికి ప్రజానీకం సన్నాహాలు చేస్తుంటే విఫలం చేయాలని అధికార పక్షం కుతంత్రాలకు పాల్పడుతోంది.

మోసపోరుున ప్రజానీకం
రాష్ట్ర విభజన వద్దంటూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా నడిపిన ప్రజలు కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలకు ఎన్నికల్లో తిరుగులేని సమాధానమిచ్చారు. అదే సమయంలో బీజేపీ, టీడీపీలు అధికారం కోసం చేసిన అబద్ధపు హామీలు నమ్మి ఓట్లేశారు. చారిత్రక తప్పు చేశామని అనతి కాలంలోనే గుర్తించగలిగారు. తమను మోసం చేసి పబ్బం గడుపుకున్న ఆ రెండు పార్టీలపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రత్యేక హోదా సంజీవని అని చెప్పిన వారే.. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతిస్తున్నామని చెప్పడంపై నిప్పులు చెరుగుతున్నారు. పాలకులు నమ్మించి మోసం చేసిన సమయంలో ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న నాయకుడు జగన్ ఒక్కడేనని నమ్ముతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న నేతకు అండగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. జై ఆంధ్రప్రదేశ్ సభకు తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. 

 
గడపగడపలో సమస్యలు ఏకరవు
అధికారం కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను నిలువునా మోసం చేశాయని ‘గడపగడపకు వైఎస్సార్’ కార్యక్రమంలో పార్టీ నేతల వద్ద జనం గగ్గోలు పెడుతున్నారు. తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఏకరవు పెడుతున్నారు. ప్రత్యేక హోదా వస్తే తప్ప పరిశ్రమలు రావని, నిరుద్యోగ సమస్య తీరదని ఆవేదన వ్యక్తం చేస్తూనే దానిని సాధించేందుకు ప్రతిపక్షం చేసే ప్రతి ప్రయత్నంలోనూ తాము భాగస్వాములవుతామని చెబుతున్నారు. వారి మనోభావాలకు అనుగుణంగా ప్రత్యేక హోదా సాధన కోసం తొలి బహిరంగ సభ విశాఖలో నిర్వహిస్తున్నారు.

తరలిరానున్న ఉత్తరాంధ్ర
ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి చేసే ప్రతి పనినీ గమనిస్తున్న మేధావి వర్గం, అడుగడుగునా జగన్‌ను అనుసరిస్తున్న యువతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నానికి బ్రహ్మరథం పట్టాలనుకుంటున్నారు. ప్రత్యేక హోదా సాధన ప్రజల భవిష్యత్ కోసం జరుగుతున్న యజ్ఞంగా భావిస్తున్న వారు తమ వంతుగా ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవాలనుకుంటున్నారు. దానికోసం ఇప్పటికే వర్గాల వారీగా అంతర్గతంగా సమావేశాలు నిర్వహించుకుని 6వ తేదీ సభకు తరలివచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పరస్పరం చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు ప్రత్యేక హోదా సభకు తండోపతండాలుగా తరలిరానున్నారు. అభివృద్ధికి దూరంగా బతుకుతున్న ఈ జిల్లాల ప్రజలు తమకు ఇస్తామంటున్న నామమాత్రపు ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ప్రయోజనం లేదని, ప్రత్యేక హోదాతోనే తమ బతుకులు మారతాయని, అది జగన్ వల్లనే సాధ్యమని నమ్ముతున్నారు. 

అధికార పక్షం కుతంత్రాలు
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీయే మిన్న అంటూ ప్రజా ప్రయోజనాలను స్వార్థం కోసం తాకట్టు పెట్టిన అధికార పార్టీ నేతలు ప్రజల కోసం ప్రతిపక్షం చేసే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలతో బహిరంగ సభను విఫలం చేయాలని ప్రయత్నిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఎవరూ సభకు వెళ్లరాదని, విద్యార్థులు సభకు వెళితే సహించేది లేదని అంతర్గంతంగా హెచ్చరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే స్థారుు నేతలు ఇంటింటికి వెళ్లి, వార్డుల్లో పెద్దలను కలిసి జగన్ సభకు వెళ్లవద్దని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం హక్కుల్ని అధికార పక్షం హరించాలని చూస్తున్నా తాము భయనపడేది లేదని జనం ’జై ఆంధ్రప్రదేశ్’ అంటూ నినదిస్తున్నారు.

మరిన్ని వార్తలు