ఎకో దంతుడికి జై

4 Sep, 2016 01:23 IST|Sakshi
ఎకో దంతుడికి జై
  • వాడవాడలా కొలువుదీరనున్న గణనాథులు              
  • తొమ్మిది రోజులపాటు ఘనంగా వేడుకలు
  • పా్లస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలతో జలవనరులకు హాని        
  • మట్టి వినాయకులే మేలంటున్న పర్యావరణవేత్తలు
  •  
    పోచమ్మమైదాన్‌ 
     విఘ్నాలు తొలగించే వినాయకుడు.. పార్వతీపుత్రుడు.. రేపు వాడవాడలా కొలువుదీరనున్నాడు. కోరిన వారి కోర్కెలు తీర్చి.. మహా నాయకుడిగా పూజలందుకోనున్నాడు. అయితే భక్తి శ్రద్ధలతో కొలిచే వినాయకుడి విగ్రహాల తయారీలో హానికరమైన రసాయన రంగుల వాడకం ఎక్కువవుతుండడంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. గణనాథుల నిమజ్జనం తర్వాత చెరువులన్నీ టన్నుల కొద్దీ కరగని వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఫలితంగా భూగర్భజలాలు, నీటి వనరులు పాడైపోతున్నాయి. ఈ నేపథ్యంలో కాలుష్యానికి ఏ మాత్రం హాని కలిగించకుండా ఉండే ఎకో దంతుడి  విగ్రహాలనే పూజించాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.వినాయకచవితి పూజలో చెరువు మట్టితో తయారుచేసిన విఘ్నేశ్వరుడినే పూజించాలని పండితులు చెబుతుంటారు. పంచభూతాల్లో ఒకటైన మట్టితో విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఫలితం ఉంటుందని వారి అభిప్రాయం. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్, ఇతర సుద్దలతో చేసిన ప్రతిమలతో ప్రాణప్రతిష్ట చేసినా ప్రయోజనం ఉండదని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొంటున్నారు. కాగా, ఆలయాల్లోనూ స్వయం భూదేవత ఆలయాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మట్టితో చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమకు కూడా విశేష శక్తి ఉంటుందనే విషయం అందరు గ్రహించాలని వారు సూచిస్తున్నారు.
    మట్టితో ప్రకృతికి›మేలు
    చెరువులు, కాల్వల్లో దొరికే బంక మట్టి వినాయకుడి ప్రతిమ తయారీకి నాణ్యంగా ఉంటుంది. ఆ మట్టిని తీసుకొచ్చి ప్రతిమను తయారు చేసి పూజించి, తిరిగి చెరువులు, కాల్వల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీటిలో ఔషధగుణాలు పెంపొందుతాయి. ప్రతిమ నీటిలో త్వరగా కరిగి పోవడంతో ఎలాంటి హానీ ఉండదు. మట్టి విగ్రహాలను పూజించడం మన సంప్రదాయ పూజ విధానం.
    పా్లస్టర్‌ ఆఫ్‌ 
    పారిస్‌తో ముప్పు
    దేవుడికి పూజ చేస్తున్నామంటే మన కు, మన చుట్టూ ఉన్నవారికి మేలు జరగాలనేదే ప్రధాన సంకల్పం. దీని ని ప్రస్తుతం ఎవరూ పాటించడం లేదు. ప్రధానంగా గణపతి నవరాత్రుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్, ఇను ముతో విగ్రహాలు తయారు చేస్తున్నారు. పూజల అనంతరం సమీపంలోని చెరువుల్లో వాటిని నిమజ్జనం చేస్తుండడంతో రసాయన పదార్థాలు నీటిలో కరగడం లేదు. రంగులు  ప్ర మాదకరంగా మారి నీటిని విషతుల్యం చేస్తున్నాయి. రసాయనాలు కలిసిన నీటిని ఎంత ఫిల్టర్‌ చేసిన విషనమూనాలు అలాగే ఉంటాయ ని పర్యావరణవేత్తలు చెబుతున్నా రు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాల్లో లెడ్, క్యాడ్మియం, కాపర్, క్రోమి యం, మెర్కురీ వంటి హానికారక రసాయనాలు ఉంటున్నాయి. వీటిని నీటిలో ఉన్న చేపలు తినడం ద్వారా కేన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉం దని వైద్యులు చెబుతున్నారు.  
మరిన్ని వార్తలు