కాపు ఉద్యమాన్ని అణచివేస్తే తిరుగుబాటు

3 Aug, 2017 23:05 IST|Sakshi
కాపు ఉద్యమాన్ని అణచివేస్తే తిరుగుబాటు
– అభివృద్ధి పనులు విస్మరించిన టీడీపీ ప్రభుత్వం 
– పోలీసులను రోడ్లు పాలు చేసి అరాచకాలు సృష్టిస్తున్న చంద్రబాబునాయుడు
– వైఎస్సార్‌ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విమర్శ
భ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పేర్కొన్నారు. ముద్రగడ పాదయాత్రను ప్రారంభిస్తున్న సందర్భంగా రాజమహేంద్రవరంలో గురువారం పోలీసులు ఆమెను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులు విస్మరించిందని అన్నారు. పుష్కర కాలువ ఎత్తిపోతల పథకం ద్వారా 1.80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తే రైతులు పంటలు పండించుకొని లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రైతులకు నీరు అందించే విషయం మర్చిపోయి కాపు ఉద్యమం అణచివేతపై దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. కాపు ఉద్యమం పోలీసులతో అణచి వేసేందుకు పోలీసులను రోడ్డు పాలు చేశారని అన్నారు. వారి విధులు నిర్వహించకుండా నిర్వీర్యం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారని అన్నిచోట్లా అవినీతి పెచ్చుమీరిందని అన్నారు. కాపు ఉద్యమాన్ని అణచివేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. 
ఎమర్జెన్సీని తలపిస్తున్న రాష్ట్ర పరిస్థితి
ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు ఎమ్మర్జన్సీని తలపిస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ, గ్రేటర్‌ రాజమహేంద్రవరం వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. గురువారం ఆయనను ప్రకాష్‌నగర్‌ సీఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం పొడవునా 144 ,30 సెక‌్షన్ల అమలు చేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రి నాయుడు, అడబాల శ్రీను, శ్రీరంగం బాలరాజు, యడ్ల మహేష్, మోర్త పవన్‌మూర్తి, గడుగుల సత్యనారాయణ, దొడ్డి వెంకటేష్, కొప్పిశెట్టి గాంధీ, యమన నారాయణ, వెంకటరమణ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు