జనయోధుడికి ఘన నివాళి

9 Oct, 2016 23:49 IST|Sakshi
జనయోధుడికి ఘన నివాళి
జిల్లావ్యాప్తంగా జక్కంపూడి వర్ధంతి
విస్తృతంగా సేవా కార్యక్రమాలు
సాక్షి, రాజమహేంద్రవరం : మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దివంగత జక్కంపూడి రామ్మోహనరావు ఐదో వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆయన అభిమానులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. పలు ప్రాంతాల్లో విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి మాజీ మంత్రి జక్కంపూడి నిరంతర పోరాటం చేశారని, తుది శ్వాస వరకూ  పేదల కోసమే పని చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కొనియాడారు. జక్కంపూడి అనుచరుడు నరవ గోపాలకృష్ణ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ‘జక్కంపూడి ప్రజా వారధి’ స్వచ్ఛంద సేవా సంస్థను, సంస్థ వ్యా¯Œæను అంబటి ప్రారంభించారు. కంబాలచెరువు సెంటర్‌లో ఉన్న జక్కంపూడి విగ్రహానికి ఆయన, సినీ నటుడు సుమన్, పార్టీ సిటీ, రూరల్‌ కో ఆర్డినేటర్లు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల వీర్రాజు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, జక్కంపూడి తనయుడు జక్కంపూడి రాజాలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అంతకుముందు వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో జక్కంపూడి చిత్రపటానికి అంబటి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ  వెఎస్‌ రాజశేఖరరెడ్డికి అంత్యంత సన్నిహితుడుగా రామ్మోహనరావు నిలిచారని అన్నారు. వైఎస్‌ జిల్లాలో పాదయాత్ర చేసినప్పడు అనారోగ్యానికి గురైతే వెన్నంటే ఉన్నారని గుర్తు చేశారు. జక్కంపూడి అనారోగ్యానికి గురైనా మంత్రివర్గంలో వైఎస్‌ కొనసాగించారని, ఇది వారి స్నేహాన్ని స్పష్టం చేస్తుం దన్నారు. వైఎస్‌ కుటుంబానికి జక్కంపూడి ఎప్పుడూ అండగా ఉండే వ్యక్తని అన్నారు. రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ, తనను నమ్ముకున్న వారికోసం ఏమైనా చేసేందుకు సిద్ధంగా ఉండే గొప్ప వ్యక్తి జక్కంపూడి అని అన్నారు. జక్కంపూడి రాజా మాట్లాడుతూ తన తండ్రి పోరాట పటిమే స్ఫూర్తిగా ప్రజా సమస్యలపై ఉద్యమిస్తానన్నారు. నమ్మకానికి మారుపేరు జక్కంపూడని ఆకుల వీర్రాజు కొనియాడారు.  పార్టీ నేతలు మిండగుదిటి మోహన్, రావూరి వెంకటేశ్వరరావు, మేడపాటి షర్మిలారెడ్డి, మింది నాగేంద్ర, సుంకర చిన్ని, పోలు కిరణ్‌మోహన్‌రెడ్డి, దంగేటి వీరబాబు, ఆర్‌వీవీ సత్యనారాయణ, జక్కంపూడి గణేష్, గుర్రం గౌతం పాల్గొన్నారు.
విస్తృతంగా సేవా కార్యక్రమాలు
 వైఎస్సార్‌ సీపీ కడియం మండల యూత్‌ కన్వీనర్‌ కొత్తపల్లి మూర్తి ఏర్పాటు చేసిన వైద్య, రక్తదాన శిబిరాలను అంబటి రాంబాబు, సినీ నటుడు సుమన్‌ ప్రారంభించారు. రాజానగరంలో  వృద్ధులకు అంబటి దుప్పట్లు పంపిణీ చేశారు. కాకినాడ రూరల్‌ రాయుడుపాలెంలో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి లింగం రవి ఆధ్వర్యాన జక్కంపూడి వర్ధంతి నిర్వహించారు. మలికిపురంలో జక్కంపూడి చిత్రపటానికి వైఎస్సార్‌ సీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి కిరణ్‌ ఆధ్వర్యాన అమలాపురం ఎన్టీఆర్‌ మార్‌్గలో జక్కంపూడి రామ్మోహనరావు వర్థంతి సభ నిర్వహించారు.
మరిన్ని వార్తలు